అన్వేషించండి

Laptop Bag: బరువుగా ఉండే ల్యాప్ టాప్ బ్యాగ్‌ను డైలీ మోయడం వల్ల శరీరానికి ఏమవుతుందో తెలుసా?

స్కూల్ బ్యాగ్ బరువు మోయడం వల్ల పిల్లల్లో కలిగే ఇబ్బందుల గురించి కొంతవరకు అవగాహన ఉంటుంది. కానీ అది మాత్రమే కాదు ల్యాప్ టాప్ బ్యాగ్ వల్ల కూడా సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

మీకు తెలుసా? ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు ప్రతిరోజూ సుమారు 3 కిలోలు బరువును భుజాన మోస్తున్నారు. అంత బరువు ఏమున్నాయని అనుకుంటున్నారా? అదేనండీ మన ల్యాప్ టాప్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పిల్లల స్కూల్ బ్యాగ్ మాత్రమే కాదు ల్యాప్ టాప్ బ్యాగ్ తగిలించుకోవడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్ టాప్ కనీసం రెండు కేజీల బరువు ఉంటుంది. దానితో పాటు లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, అవసరమైన స్టేషనరీ వస్తువులు కూడా అదే బ్యాగ్ లో పెట్టుకుని భుజాన తగిలించుకుని ఆఫీసుకి వెళ్తూ ఉంటారు. డైలీ అంత బరువు మోస్తూ ఉండటం వెన్నెముక, మెడ, తల మీద భారం పడుతుంది.

బరువు ఎక్కువగా ఉండే స్కూల్ బ్యాగ్ లేదా ల్యాప్ టాప్ బ్యాగ్స్ నిత్యం భుజం మీద మోయడం వల్ల శరీర భంగిమలో మార్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కండరాలు ముఖ్యంగా భుజాలు, మెడ వెనుక భాగంలో అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. బరువైన బ్యాగులు స్థిరంగా మోయడం వల్ల దీర్ఘకాలిక మార్పులు దారి తీస్తుంది. బ్యాగ్ బరువు నుంచి వచ్చే ఒత్తిడి కీళ్ల మీద కూడా పడుతుంది. కౌమారదశలో ఉన్న వాళ్ళు భారీ బరువు ఉన్న సంచులు మోయడం వల్ల పార్శ్వగూని వంటి వెన్నెముక వైకల్యాలు కూడా దారి తీయవచ్చు. కండరాలు, స్నాయువుల మీద ప్రభావం పడుతుంది. కాలక్రమేణా ఈ సమస్యలు మస్క్యులోస్కెలెటల్ సమస్యలు వస్తాయి. అలసట, అసౌకర్యానికి దారి తీస్తుంది. మొత్తం శ్రేయస్సుని ప్రభావితం చేస్తుంది.

బరువు తగ్గించుకునే మార్గాలు

⦿ బ్యాగ్ బరువు తగ్గించుకునేందుకు ముందుగా ప్రయత్నించాలి. దానిలో మీకు అవసరమైన వాటిని మాత్రమే తీసుకెళ్లాలి. అనవసరమైన వస్తువులు తీసేయడమే మంచిది.

⦿ ప్యాడెడ్ పట్టీలు, బ్యాక్ సపోర్ట్ ఉన్న బ్యాగ్ లు ఎంచుకోవాలి. వాటి వెడల్పు బాగుండే విధంగా చూసుకోవాలి. ప్యాడెడ్ బ్యాక్ ప్యానెల్ ఉన్నవి అనుకూలంగా ఉంటాయి.

⦿ బరువైన వస్తువులు వీపుకు దగ్గరగా, తేలికైన వస్తువులు బ్యాగ్ వెలుపల ఉంచుకుంటే మంచిది. బరువును సమానంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

⦿ బ్యాగ్ పట్టీలు రెండూ తగిలించుకోవాలి. ఒక భుజానికి మాత్రమే తగిలించుకుని ఉండటం వల్ల ఒత్తిడి ఒకవైపు అధికంగా పడుతుంది. అందుకే రెండు పట్టీలు తగిలించుకుంటే మంచిది.

⦿ వీపుకి బాగా పైకి బ్యాగ్ పట్టీలు పెట్టుకోకూడదు. బరువు ఎక్కువగా అనిపిస్తుంది. బ్యాగ్ తాళ్ళు కూర్చునే ప్రదేశానికి ఆనుకునే విధంగా అడ్జెస్ట్ చేసుకుంటే మంచిది.

⦿ నడుము, ఛాతీకి కుదిరితే పట్టీలు వేసుకోవడం వల్ల బరువు ఎక్కువగా అనిపించదు. బ్యాక్ ప్యాక్ వెయిట్ శరీర బరువులో 10-15 శాతానికి మించకూడదు.

⦿ ఎక్కువ సేపు బరువైన బ్యాగ్ తీసుకెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మధ్య మధ్యలో భుజానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది.

⦿ బ్యాగ్ బరువుని బ్యాలెన్స్ చేసేందుకు రెండు వైపులా మార్చుకుంటూ ఉండాలి.

⦿ ల్యాప్ టాప్ తో పాటు మరిన్ని వస్తువులు తీసుకెళ్లాల్సి వస్తే రోలింగ్ బ్యాగ్స్ ఉపయోగించాలి. ఇది భుజాల మీద భారాన్ని తగ్గిస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: సబ్జా గింజలు శరీరానికి చల్లదనం మాత్రమే కాదు మరెన్నో ప్రయోజనాలు ఇస్తాయ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Curd Poha: పొయ్యి వెలిగించకుండా చిటికెలో చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇదే! రుచి, ఆరోగ్యం, ఆదాయం మూడు గుణాల అటుకుల పెరుగు!
పొయ్యి వెలిగించకుండా చిటికెలో చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇదే! రుచి, ఆరోగ్యం, ఆదాయం మూడు గుణాల అటుకుల పెరుగు!
Orange Juice : వేసవిలో ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. కానీ వాళ్లు తాగకూడదట
వేసవిలో ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. కానీ వాళ్లు తాగకూడదట
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
AC Buying Guide : ఎండలు పెరుగుతున్నాయని AC కొనడానికి వెళ్తున్నారా? ఈ విషయాలు మరచిపోకండి, లేదంటే నష్టమే
ఎండలు పెరుగుతున్నాయని AC కొనడానికి వెళ్తున్నారా? ఈ విషయాలు మరచిపోకండి, లేదంటే భారీ నష్టం

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case :13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎందుకు చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎందుకు చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్!
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్!
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget