అన్వేషించండి

Tomatoes: టమాటోలు అధికంగా తింటున్నారా? ఈ ఆరోగ్యసమస్యలు రావచ్చు

తెలుగిళ్లల్లో టమాటోల వాడకం అధికం. వాటిని అతిగా తింటే ఏమవుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

మన ఇళ్లల్లో టమాటో లేనిదే ఏ వంటా పూర్తవ్వదు. పచ్చడి నుంచి బిర్యానీ వరకు అన్నింట్లోనూ టమాటో ముక్క పడాల్సిందే. టమాటో ఆరోగ్యానికే మంచిదే. దీనివల్ల ఎన్నో పోషక విలువలు శరీరానికి అందుతాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. లైకోపీన్ అని పిలిచే అతి ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఈ రెండింటి కోసమే మనం టమాటోలను తింటాం. కానీ ఏవైనా మితంగా తింటేనే ఆరోగ్యం. అతిగా తింటే ఏదో ఒక ప్రమాదం పొంచే ఉంటుంది. అలాగే టమాటోలు కూడా అధికంగా తినడం వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. 

ఎసిడిటీ
టమాటోలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే అవి పుల్లగా ఉంటాయి. వాటిని అతిగా తినడం వల్ల గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ కలగచ్చు. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవాళ్లు టమోటాలను తక్కువగా తినాలి. 

చర్మం రంగుమారడం
టోమాటోలు అధికంగా తినడం వల్ల చర్మ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇది లైకో పెనడెర్మియా అనే పరిస్థితిని కలిగిస్తుంది. రక్తంలో లైకోపీన్ అధికంగా చేరి, చర్మం రంగు మారడం జరుగుతుంది. రోజుకు 75 మిల్లీ గ్రాముల లైకోపీన్ కు మించి తీసుకోకపోవడం మంచిది. 

అలెర్జీ
టమాటోలలో హిస్టామిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఎక్కువైతే దగ్గు, తుమ్ములు, చర్మంపై దద్దుర్లు, గొంతులో దురద వంటి అలెర్జీలు కలుగుతాయి. మీకు ఇలాంటి అలెర్జీలు ఉన్నట్లయితే టమాటోలు తగ్గించండి.

కీళ్ల నొప్పులు
టమాటోల్లో సొలనిన్ అనే ఆల్కాలాయిడ్ ఉంటుంది. ఇది కీళ్లవాపు, నొప్పిని కలిగిస్తుంది. ఈ కూరగాయలను అధికంగా తినడం వల్ల కణజాలాల్లో కాల్షియం పేరుకుపోయే ప్రమాదం పెరిగిపోతుంది. మీకు కీళ్ల నొప్పులు ఉంటే టమోటాలను చాలా తక్కువగా తినాలి. 

కిడ్నీ స్టోన్స్
టమాటోలు అధికంగా తినేవారి కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. టమాటోల్లోని కొన్ని సమ్మేళనాలు జీర్ణరసాల ద్వారా విచ్ఛిన్నం కావు. ఫలితంగా కాల్షియం, ఆక్సలేట్ శరీరంలో పేరుకుపోతాయి. దీనివల్ల రాళ్లు ఏర్పడతాయి. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: వేసవి సెలవుల్లో హంపి ట్రిప్ అదిరిపోతుంది, అక్కడ కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవిగో

Also read: పిల్లలకు నచ్చే స్నాక్ క్రిస్పీ కార్న్, చేయడం ఎంతో సులువు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Dinner Timings : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
Multani Mitti Face Pack : సమ్మర్‌లో ముల్తానీ మట్టి వాడుతున్నారా?.. లాభాలు, తయారీ విధానం, జాగ్రత్తలు ఇవే
సమ్మర్‌లో ముల్తానీ మట్టి వాడుతున్నారా?.. లాభాలు, తయారీ విధానం, జాగ్రత్తలు ఇవే
Dating App Scams : డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి
డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
Embed widget