(Source: ECI/ABP News/ABP Majha)
Diwali 2022: వామ్మో, ఎంత పెద్ద దీపమో - ప్రపంచంలోనే అతి పెద్ద దియాగా గిన్నీస్ రికార్డ్!
దీపావళి పండుగ సందర్భంగా మోహాలీలో తయారు చేసిన దీపంత ప్రపంచ రికార్డు సాధించింది. 1,000 కిలోల ఉక్కుతో తయారు చేసిన ఈ దియా, ప్రపంచంలోనే అతిపెద్దిగా గుర్తింపు పొందింది.
దీపావళి పర్వదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలంతా ఆనందోత్సాహాల నడుమ దీపావళిని ఎంజాయ్ చేస్తున్నారు. దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని మొహలీలో అతి పెద్ద దీపం ఏర్పాటు చేశారు. ఇది ఏకంగా గిన్నీస్ రికారులకు సైతం ఎక్కేసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద దివ్వె
వెలుగుల పండుగ సందర్భంగా పంజాబ్ లోని మోహాలీలో ఏర్పాటు చేసిన దీపం అరుదైన గుర్తింపు దక్కించుకుంది. హీరో హోమ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ భారీ దియాను సుమారు వెయ్యి కిలోల ఉక్కుతో తయారు చేశారు. 3.37 మీటర్ల వ్యాసార్థంతో రూపొందించారు. ఈ దీపంలో హీరో హోమ్స్ నివసిస్తున్న 4 వేల మందితో పాటు చుట్టుపక్కల ఉన్న వారితో కలిపి సుమారు 10 వేల మంది ఇందులో 3,560 లీటర్ల నూనెను పోశారు.
ఈ దియా ప్రారంభోత్సం సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. వారి సమక్షంలోనే ఈ భారీ స్టెయిన్ లెస్ స్టీల్ దియాను వెలిగించారు. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) KJ సింగ్ ఈ దియాను వెలిగించారు. "సాంప్రదాయం ప్రకారం దీపావళిని జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దియాను ఏర్పాటు చేశారు. దీపావళి ఉద్దేశాన్ని సామాజిక సందేశాన్ని ప్రజలకు వివరించడానికే ఈప్రయత్నం. చాలా ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎన్నో గొడవలు జరిగాయి. ప్రస్తుతం శాంతి సామరస్యంతో కొనసాగుతోంది. శాంతికి అది పెద్ద చిహ్నంగా ఈ దియాను ఏర్పాటు చేశాం” అని సింగ్ వెల్లడించారు.
గిన్నిస్ రికార్డుల్లోకి మోహాలి దియా
హీరో రియాల్టీ యొక్క CMO, ఆశిష్ కౌల్ ఈ దియా ఏర్పాటుపై స్పందించారు. " దీపావళి పండుగ అనేది శాంతి, సామరస్య పునరుద్ధరణను సూచిస్తుంది. ప్రాంతాలు, భాషలు, మతాలు, సాంస్కృతులకు అతీతంగా ఈ దియాలో నూనె పోశారు. ఈ నూనె శాంతి ఐక్యతా సంకల్పాన్ని సూచిస్తుంది. దివ్వె వెలుగు అనేది భారతీయుల ఆత్మగా భావివస్తారు” అని వెల్లడించారు. అటు ఈ దివ్వెను ప్రపంచంలోనే అతిపెద్ద దియాగా గుర్తిస్తున్నట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ విషయాన్ని గిన్నిస్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు.
Read Also: ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా బోరు కొట్టదు - 46 కిమీల ప్రయాణానికి ఎంత టైమ్ పడుతుందో తెలుసా?