Diarrhoea Causes : డయేరియా డేంజర్ బెల్స్.. ఈ లక్షణాలు గుర్తిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి.. లేదంటే కష్టమే
Diarrhoea Symptoms and Treatment : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం డయేరియా భయం పట్టుకుంది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడలో డయేరియా మరణాలతో భయం పెరిగింది. దీనికి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Vijayawada Diarrhoea Cases : విజయవాడలో డయేరియా కారణంగా చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కలుషిత నీటివల్లనే ఈ మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ప్రజలు డయేరియా రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. ఇంతకీ డయేరియా ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏంటి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది? సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడుతెలుసుకుందాం.
వారు మరింత జాగ్రత్తగా ఉండాలి..
డయేరియా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అలాగే వివిధ పరిస్థితుల్లో ఇదే వచ్చే అవకాశముంది. అయితే డయేరియా వచ్చినప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండేందుకు ఎక్కువగా పానీయాలు, నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఎందుకంటే నీళ్ల విరేచనాల రూపంలో శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా నీటిని ఎక్కువగా తీసుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా న్యూట్రిషన్స్ కలిగి ఫుడ్స్ తీసుకోవాలంటున్నారు. పిల్లలపై ఇది ఎక్కువ ప్రభావం చూపే అవకాశముంది కాబట్టి.. వారి విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు.
వెంటనే చికిత్స తీసుకోవాలి..
కలుషిత నీరు, ఫుడ్ పాయిజన్, ఫుడ్ అలెర్జీ, సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, కొన్ని మందులు వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్లు ఇలా చాలా కారణాల వల్ల డయేరియా వస్తుంది. వాంతులు, కడుపునొప్పి, బరువు తగ్గడం, శరీరంలో నీటి స్థాయులు తగ్గడం, మలంలో మార్పులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలు రెండు రోజులకంటే ఎక్కువ ఉంటే వైద్యసహాయం తీసుకోవాలంటున్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఇబ్బందిని గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారం కంటే ఎక్కువైతే సమస్య మరింత త్రీవమవుతుంది.
కంట్రోల్ చేసేందుకు..
ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకుంటే సమస్యను కంట్రోల్ చేయవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇదే డయేరియాతో పోరాడుతుందని చెప్తున్నారు. వైద్యుల సాయం తప్పక తీసుకోవాలని.. లేకుంటే మృత్యువాత పడినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్తున్నారు. వైద్యులు సూచించే ఫుడ్స్ తీసుకుంటూ చికిత్స చేయించుకుంటే.. డయేరియా లక్షణాలు పెరగకుండా కంట్రోల్ అవుతాయి.
వాటికి దూరంగా ఉండాలి..
కొన్ని ఆహారాలు డయేరియాను తీవ్రతరం చేస్తుంటాయి. అలాంటి ఆహార పదార్థాలక జోలికి అస్సలు వెళ్లకూదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉండే ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, ఆల్కహాల్, బీన్స్ వంటి ఫుడ్స్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయని చెప్తున్నారు. అయితే కొన్ని ఫుడ్స్ కొందరిపై వివిధ రకాల ప్రభావాన్ని చూపిస్తాయని కూడా తెలిపారు.
Also Read : అకాల మరణానికి దారితీస్తున్న డెస్క్ జాబ్‌లు.. వామ్మో ఎక్కువసేపు కూర్చోంటే ఇంత డేంజరా?