అన్వేషించండి

Turkish Chicken Recipe : రెస్టారెంట్ స్టైల్ టర్కిష్ చికెన్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి, రెసిపీ ఇదే

Creamy Turkish Chicken : చికెన్​ను మరింత టేస్టీగా, క్రీమీ ఫ్లేవర్​తో తినాలనుకుంటే కచ్చితంగా టర్కీష్ చికెన్​ను ట్రై చేయాల్సిందే. దీనిని చాలా సింపుల్​గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెసిపీ ఇదే.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెరుగు, మసాలాలతో చికెన్‌ను అరగంట మ్యారినేట్ చేయాలి.
  • మ్యారినేట్ చేసిన చికెన్‌ను బటర్‌లో బాగా ఉడికించాలి.
  • బటర్, మైదా, పాలతో క్రీమీ సాస్‌ను చిక్కగా చేయాలి.
  • ఉడికిన చికెన్‌పై సాస్, చీజ్ వేసి సర్వ్ చేయాలి.

Creamy and Spicy Turkish Chicken Recipe : చికెన్‌తో ఎప్పుడూ ఒకే రకమైన కర్రీలు, ఫ్రైలు చేసుకుని బోర్ కొడుతుందా? అయితే కాస్త కొత్తగా ఈ టర్కిష్ చికెన్‌ను ట్రై చేయండి. పెరుగు, మసాలాలతో మ్యారినేట్ చేసిన చికెన్‌ను క్రీమీ సాస్‌తో కలిపి తయారు చేసే ఈ రెసిపీ రుచిగా ఉండటంతో పాటు ప్రోటీన్ కూడా అందిస్తుంది. అయితే దీనిని తినేందుకు రెస్టారెంట్​ స్టైల్​లోనే ఇంట్లో సులభంగా  తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

టర్కిష్ చికెన్‌కు కావాల్సిన పదార్థాలు

బోన్‌లెస్, స్కిన్‌లెస్ చికెన్ - అరకేజి

పెరుగు - 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు - 1 టీస్పూన్

కారం - 1 టీస్పూన్

మిరియాల పొడి - 1 టీస్పూన్

జీలకర్ర పొడి - 1/3 టీస్పూన్

పాప్రికా - 1/2 టేబుల్ స్పూన్

టమాటా పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు

Also Read : బయట క్రిస్పీగా.. లోపల జ్యూసీగా ఉండే హైదరాబాద్ చికెన్ 65.. రెసిపీ ఇదే

అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టేబుల్ స్పూన్

బటర్ - 2 టేబుల్ స్పూన్లు

మైదా - 1 టేబుల్ స్పూన్

స్కిమ్డ్ మిల్క్ - 150 మిల్లీలీటర్లు

గార్లిక్ పౌడర్ - చిటికెడు

చిల్లీ ఫ్లేక్స్ - చిటికెడు

ఒరేగానో - చిటికెడు

చీజ్ - 20 గ్రాములు

కొత్తిమీర - కొద్దిగా

చికెన్‌ మ్యారినేషన్..

ముందుగా ఒక బౌల్‌లో అరకేజి బోన్‌లెస్, స్కిన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. అందులో పెరుగు, ఉప్పు, కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పాప్రికా, టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ చికెన్‌కు బాగా పట్టేలా కలపాలి. దీనిని అరగంట నుంచి గంట వరకు పక్కన పెట్టుకోవాలి.

Also Read : గుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ.. అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది

టర్కిష్ చికెన్‌ తయారీ విధానం

ముందుగా స్టవ్‌ వెలిగించి దానిపై పాన్ పెట్టి మీడియం ఫ్లేమ్‌ పెట్టాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేయాలి. బటర్ కరిగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్‌ను పాన్‌లో వేసి సమానంగా పరచాలి. చికెన్ అన్ని వైపులా బాగా ఉడికేలా మధ్య మధ్యలో తిప్పుతూ 15 నిమిషాలు ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత క్రీమి సాస్ చేసుకోవాలి.

క్రీమీ సాస్ కోసం..

ఇప్పుడు మరో పాన్ తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి కరిగించాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ మైదా వేసి కలపాలి. తర్వాత 150 మిల్లీలీటర్ల స్కిమ్డ్ మిల్క్‌ను కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. ఉండలు లేకుండా స్మూత్‌గా కలిసే వరకు ఉడికించాలి. దానిలో గార్లిక్ పౌడర్, కొద్దిగా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, నల్ల మిరియాల పొడి, ఒరేగానో వేసి బాగా కలపాలి. సాస్ కాస్త చిక్కగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

Also Read : 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఆమ్లెట్ కర్రీ.. టేస్టీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ ఇదే

పూర్తిగా ఉడికిన చికిన్​పై.. తయారు చేసుకున్న క్రీమీ సాస్‌ను పోయాలి. తర్వాత చీజ్ వేసి పాన్‌కు మూత పెట్టాలి. ఫ్లేమ్‌ను తగ్గించి ఉంచి సుమారు 2 నిమిషాలు ఉడికించాలి. చీజ్ కరిగిన తర్వాత పైన కొత్తిమీర చల్లితే టేస్టీ టేస్టీ టర్కిష్ చికెన్ రెడీ. ఈ చికెన్‌ను రోటీ, నాన్, బ్రెడ్ లేదా రైస్‌తో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే సైడ్ డిష్​గా కూడా తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ టేస్టీ చికెన్ రెసిపీని ట్రై చేసేయండి.

Also Read : సండే స్పెషల్ స్పైసీ, టేస్టీ చికెన్ రోస్ట్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది, బ్యాచిలర్స్ కూడా ఈజాగా ట్రై చేసుకోవచ్చు

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Backward Walking : వెనక్కి నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎప్పుడు, ఎంత సేపు నడిస్తే మంచిది?
వెనక్కి నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎప్పుడు, ఎంత సేపు నడిస్తే మంచిది?
Cigarette Cravings : సిగరెట్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి, స్మోకింగ్ తగ్గించుకోగలుగుతారు
సిగరెట్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి, స్మోకింగ్ తగ్గించుకోగలుగుతారు
Curry Leaf Oil For Hair : కరివేపాకులు తెల్లజుట్టును నల్లగా మార్చేస్తాయా? ఇంట్లోనే కరివేపాకు నూనె ఇలా చేసుకోండి
కరివేపాకులు తెల్లజుట్టును నల్లగా మార్చేస్తాయా? ఇంట్లోనే కరివేపాకు నూనె ఇలా చేసుకోండి
High Cholesterol : భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
Advertisement

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Third Front: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ 2.0 - మమత, అఖిలేష్, జగన్‌లతో నయా కూటమికి ప్లాన్ చేస్తున్నారా?
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ 2.0 - మమత, అఖిలేష్, జగన్‌లతో నయా కూటమికి ప్లాన్ చేస్తున్నారా?
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Tea With Snacks : సమోసాలు, బిస్కెట్లు మాత్రమే కాదు.. టీతో పాటు ఇవి తినడం కూడా మంచిది కాదట
సమోసాలు, బిస్కెట్లు మాత్రమే కాదు.. టీతో పాటు ఇవి తినడం కూడా మంచిది కాదట
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
Embed widget