అన్వేషించండి

High Flame: పెద్ద మంట పెట్టి వంట చేస్తున్నారా? అలాంటి ఆహారం తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం

అధిక ఉష్ణోగ్రతల వద్ద వండిన ఆహారాన్ని తినడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

త్వరగా వంట పూర్తవ్వాలన్న కారణంగా ఎక్కువ మంది అధిక ఉష్ణోగ్రత వద్ద, పెద్ద మంట పెట్టి ఆహారాన్ని ఉడికిస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెబుతోంది ఒక కొత్త అధ్యయనం. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని ఉడికించడం వల్ల ఆహారంలోనే DNA దెబ్బతింటుంది.  ఆహారం తినే వ్యక్తి శరీరంలో ఉన్న డిఎన్ఏ ని కూడా, ఈ ఆహారంలోని డిఎన్ఏ మార్చే అవకాశం ఉంది. దీనివల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ఛాన్సులు పెరుగుతాయని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా మాంసాహార వంటకాలు, డీప్ ఫ్రై చేసిన వంటకాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద వండి,  వాటిని తరచూ తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుందని ఈ పరిశోధన చెబుతుంది.

మన ఆహారంలో ఎక్కువగా మాంసం, పండ్లు, కూరగాయలు, చేపలు, చికెన్, ధాన్యాలు, నట్స్, పుట్టగొడుగులు వంటివి ఉంటాయి. వీటన్నింటిలో కూడా డిఎన్ఏ ఉంటుంది. అదే ఆ ఉత్పత్తి రంగును, ఆకారాన్ని నిర్ణయిస్తుంది. వీటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువసేపు ఉడికిస్తే ఆ డిఎన్ఏ లో చాలా మార్పులు వస్తాయి. ఆహారం ద్వారా ఆ చెడిపోయిన డిఎన్ఏ మంచి శరీరంలో చేరి తీవ్ర అనారోగ్యాలకు కారణం అవుతుంది. ఈ డీఎన్ఏ శరీరంలో చేరాక మ్యుటేషన్ చెందుతుంది. ఇవి మనిషి డిఎన్ఏ  చెడగొడుతుంది. అందుకే ఎక్కువ మంట వద్ద వండిన ఆహారాలను తినకూడదని చెబుతోంది అధ్యయనం.

ల్యాబ్ లో ఎలుకలపై చేసిన అధ్యయనం ద్వారా ఈ ఫలితాలను వెల్లడించారు పరిశోధకులు. కాబట్టి వంట చేసే పద్ధతి మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని అర్థం చేసుకోవాలి. జన్యుపరమైన మార్పులు అనారోగ్యాలకి కారణమవుతాయి. అందుకే ఆహార తయారీపై దృష్టి సారించాలి. వీలైనంతవరకు చిన్న లేదా మీడియం మంట మీదే ఆహారాన్ని వండడం చాలా ముఖ్యం. డీప్ ఫ్రైలు అధికంగా తినడం మానేయాలి. క్యాన్సర్ కారకాలు శరీరంలో చేరే అవకాశం ఎక్కువ. నీళ్లలో ఉడికించిన ఆహారాన్ని తినడం వల్ల మేలు జరుగుతుంది. అంటే కూరలు, అన్నం వంటివి తినడమే ఆరోగ్యకరం. నేరుగా మంటపై కాల్చిన మొక్కజొన్న పొత్తులు, చపాతీలు వంటివి కూడా తినకూడదు. వీటిలో కూడా క్యాన్సర్ కారకాలు జనిస్తాయి. తాజా ఆకుకూరలు, పండ్లపైన ఆధారపడితే ఆరోగ్యం బాగుంటుంది. ఆధునిక కాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Also read: అధికంగా త్రేన్పులు వస్తున్నాయా? ఇలా చేయండి, తగ్గుతాయి

Also read: బాలింతల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వారు పోస్టుపార్టమ్ డిప్రెషన్ బారిన పడినట్టే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hidden Heart Risks : గుండెపోటు రిస్క్ పెంచేస్తోన్న ప్రధాన కారకం.. కొలెస్ట్రాల్ కాదంటోన్న నిపుణులు, జాగ్రత్త సుమీ
గుండెపోటు రిస్క్ పెంచేస్తోన్న ప్రధాన కారకం.. కొలెస్ట్రాల్ కాదంటోన్న నిపుణులు, జాగ్రత్త సుమీ
Visa Interview Tips : వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
Choco Chip Cookies : చాకో చిప్ కుకీస్ సింపుల్, టేస్టీ రెసిపీ.. ఎగ్ లేకుండా ఎలా చేయవచ్చంటే
చాకో చిప్ కుకీస్ సింపుల్, టేస్టీ రెసిపీ.. ఎగ్ లేకుండా ఎలా చేయవచ్చంటే
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Embed widget