Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Drumstick Chicken Curry Recipe : మునగకాయ చికెన్ కూరను సరిగ్గా చేసుకోవాలే కానీ తింటే రుచి అదిరిపోతుంది. దీనిని ప్రోపర్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

- మునగకాయ చికెన్ కూర కోసం చికెన్‌ను మసాలాలతో సిద్ధం చేయాలి.
- నూనెలో మసాలాలు, ఉల్లిపాయలు, టమాటాలు వేసి గ్రేవీ చేయాలి.
- తరువాత చికెన్, మునగకాయలు కలిపి మెత్తగా ఉడికించుకోవాలి.
Chicken Curry With Drumstick : చికెన్ కర్రీ అంటే చాలామందికి ఇష్టమే. అయితే ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా కాస్త కొత్తగా, రుచిగా తినాలనుకుంటున్నారా? అయితే మీరు మునగకాయలతో చికెన్ కర్రీ చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ చాలామంది ఇష్టంగా తింటారు. ఎందుకంటే మునగకాయల రుచి, చికెన్ మసాలతో కలిసి.. కూరకు మంచి టేస్ట్ ఇస్తాయి. ఇలా తయారు చేసిన రుచికరమైన చికెన్ కర్రీని వేడి వేడి అన్నంలో, రాగి సంగటి లేదా చపాతీల్లో చేసుకుని తినవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
చికెన్ - అరకేజీ
మునగకాయలు - 2
ఉల్లిపాయలు - 2
టమాటాలు - 2
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
Also Read : రెస్టారెంట్ స్టైల్ టర్కిష్ చికెన్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి, రెసిపీ ఇదే
కారం - 1 నుంచి 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
దాల్చిన చెక్క, లవంగాలు - కొద్దిగా
కరివేపాకు, కొత్తిమీర - తగినంత
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
నీళ్లు - అవసరమైనంత
Also Read : బయట క్రిస్పీగా.. లోపల జ్యూసీగా ఉండే హైదరాబాద్ చికెన్ 65.. రెసిపీ ఇదే
తయారీ విధానం
ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి నీళ్లన్నీ పోయేలా వడకట్టుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్‌కు మసాలా రుచి బాగా పడుతుంది. తర్వాత మునగకాయలను శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి. మరీ చిన్నగా కోస్తే ఉడికేటప్పుడు ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌవ్‌పై గిన్నె పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. ఇప్పుడు తరిగిన టమాటాలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. తర్వాత కారం, ధనియాల పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి. మసాలా మిశ్రమం దగ్గరగా వచ్చి నూనె పైకి తేలే వరకు ఉడికిస్తే కూరకు మంచి రుచి వస్తుంది.
అదే సమయంల చికెన్ ముక్కలను వేసి మసాలాతో బాగా కలపాలి. మూత పెట్టి కాసేపు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ నుంచి కొంత నీరు బయటకు వస్తుంది. అవసరాన్ని బట్టి కొద్దిగా వేడి నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. చికెన్ సగం వరకు ఉడికినప్పుడు మునగకాయ ముక్కలను వేసి కలపాలి. అవసరమైతే కాస్త నీళ్లు పోసి చికెన్, మునగకాయలు మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి.
చికెన్, మునగకాయలు పూర్తిగా ఉడికిన తర్వాత గరం మసాలా, తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. మరో రెండు నిమిషాలు ఉడికించి స్టౌవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఘుమఘుమలాడే మునగకాయ చికెన్ కర్రీ సిద్ధం. టేస్టీగా, వెరైటీగా తినాలనుకున్నప్పుడు మీరు దీనిని కచ్చితంగా ట్రై చేయవచ్చు. మీరు కూడా పక్కా ట్రై చేయండి.
Also Read : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























