By: ABP Desam | Updated at : 03 Jul 2022 08:00 AM (IST)
image credit: pixabay
పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే తల్లిదండ్రులు నానా తంటాలు పడుతూ ఉంటారు, వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా ఉండాలని రకరకాల పదార్థాలు చేసి పెడతారు. కానీ అవేమీ తినకుండా విసిగిస్తుంటారు. దీంతో వాళ్ళకి సరైన ఆహారం అందక అనారోగ్యానికి గురవుతారు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి కాల్షియం అందె విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కాల్షియం
బాదంపప్పు
పిల్లలకి కాల్షియం సరిగా అందె విధంగా చూసుకోవాలి. అందుకు బాదంపప్పు చాలా మంచిది. గుప్పెడు బాదంపప్పులో 110 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. పిల్లలకి బ్రెయిన్ డెవలప్ మెంట్ , జ్ఞాపకశక్తి పెరుగుదలకి బాదంపప్పు ఉపయోగపడుతుంది.
సోయా
సోయ మిల్క్, సోయాబీన్స్ లో అధిక పోషకాలు ఉంటాయి. ఇందులో కూడా కాల్షియం మెండుగా ఉంటుంది. కానీ వీటిని తినడానికి పిల్లలు పెద్దగా ఇష్టపడరు.
పాల ఉత్పత్తులు
పాలు, పెరుగు వంటి డైరీ ప్రొడక్ట్స్ లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లల భోజనంలో పెరుగు తప్పని సరిగా ఉండేవిధంగా చూసుకోవాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలు చాలా మంది పాలు తాగడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసం బాదం పొడి చేసి పెట్టి రోజూ పాలల్లో కలిపి ఇస్తే ఇష్టంగా తాగుతారు. పాల పదార్థాలతో తయారైన చీజ్, పనీర్, బటర్ పదార్థాలలోను కాల్షియం ఉంటుంది.
పచ్చి బటానీ
ఒక కప్పు పచ్చి బటానీల్లో 45 గ్రాముల కాల్షియం లభిస్తుంది. పిల్లల ఎముకల పుష్టికి పచ్చి బటానీలు మంచి ఆహారం. వీటి వల్ల పిల్లలకి అవసరమైన విటమిన్ కె పుష్కలంగా దొరుకుతుంది.
నారింజ
ఒక ఆరెంజ్ పండులో 50 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే ఆరెంజ్ జ్యూస్ పిల్లలకి అలవాటు చేయాలి. షాపుల్లో దొరికే ఆరెంజ్ జ్యూస్ కాకుండా ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసిన జ్యూస్ ఇవ్వడం ఆరోగ్యానికి మంచిది.
బీన్స్
100 గ్రాముల బీన్స్ లో 113మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుంది. పిల్లలు వీటిని తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ వాటిని ఎలాగైనా పిల్లలతో తినిపించే విధంగా తల్లిదండ్రులు చేయాలి. బీన్స్ తో రుచికరమైన వంటకాలు చేసి వాళ్ళకి పెట్టాలి.
చేపలు
చేపల్లో కూడా కాల్షియం మెండుగా ఉంటుంది. మీ పిల్లలు కనుక చేపలు తినడానికి ఇష్టపడుతుంటే వాటిలో ముళ్ళు తీసి అందించండి. లేదంటే చేపలు తినడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు.
రాగి
100 గ్రాముల రాగుల్లో 344 మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది. మీ పిల్లలకి రాగి జావతో పాటు రకరకాల వంటలు చేసి పెట్టొచ్చు. ఎముకల బలానికి రాగులు ఎంతో దోహదపడతాయి.
పాలకూర
పాలకూరలో కాల్షియం అధికంగా లభిస్తుంది. పిల్లలు తినేందుకు ఇష్టపడరు కానీ ఏదో ఒక విధంగా వాళ్ళకి పెట్టాలి. పాలకూర కంటికి కూడా చాలా మంచిది. 100 గ్రాముల పాలకూరలో 99 మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది.
ఫిట్స్ ఎందుకొస్తాయి? రోగి చేతిలో తాళం చేతులు ఎందుకు పెట్టకూడదు? మూర్ఛ వచ్చిన వెంటనే ఏం చేయాలి?
Vitamin K2: విటమిన్ K2 - ఇది లోపిస్తే ఆరోగ్యానికి చేటు, ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి
Food: ఈ టేస్టీ ఫుడ్ వద్దు డూడ్, పొట్ట పెంచేస్తాయ్, పరేషాన్ చేసేస్తాయ్!
Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి
Breakfast: మీ గుండె పదిలంగా ఉండాలంటే ఈ బ్రేక్ ఫాస్ట్ తినెయ్యండి
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇక ఆన్లైన్లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!
చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?
Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్ అయ్యాడని క్రికెటర్ చెంపలు వాయించిన ఐపీఎల్ ఓనర్!!