Foods to Improve Mood : శృంగార కోరికను పెంచే ఫుడ్స్ ఇవే.. మగవారికే కాదు, ఆడవారికి కూడా
Foods to Boost Libido : లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకునేందుకు కొన్ని ఫుడ్స్ రెగ్యులర్‌గా తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి? వాటితో కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

Foods That Improve Mood and Intimacy : శృంగార జీవితం బాగుంటే శారీరకంగా, మానసికంగా కూడా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెప్తారు నిపుణులు. అయితే ఈ మధ్యకాలంలో వివిధ కారణాల వల్ల చాలామంది లైంగికంగా యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారని చెప్తున్నారు. దీనికి కారణంలో శరీరంలో లిబిడో స్థాయిలు తగ్గడమే. లిబిడో తగ్గిపోతే సెక్స్‌పై ఇంట్రెస్ట్‌తో పాటు.. స్టామినా కూడా తగ్గిపోతుంది. ఆడవారితో పాటు మగవారు కూడా ఈ తరహా సమస్యను ఎదుర్కొంటున్నారు.
శరీరంలో లిబిడో స్థాయిలు పెంచుకుంటే శృంగార జీవితం మెరుగ్గా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. వీటితో పాటు హెల్తీ ఫుడ్స్‌ని డైట్లో తీసుకోవాలి. ముఖ్యంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కొన్ని ఫుడ్స్ తీసుకోవాలని.. వాటి వల్ల మగవారిలోనే కాకుండా ఆడవారిలో కూడా లిబిడో, మూడ్ స్థాయిలు పెరుగుతాయని చెప్తున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో చూసేద్దాం.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ తింటే సెరోటోనిన్, డోపమైన్ లెవెల్స్ పెరుగుతాయి. వీటిని ఫీల్ గుడ్ హార్మోన్లు అంటారు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా దీనిని తింటే రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా పెరుగుతాయట.
నట్స్, సీడ్స్
బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు వంటివి డైట్లో తీసుకోవాలి. వీటిలో ఒమేగా 3 పుష్కలంగా ఉండడంతో పాటు ఫ్యాటీ యాసిడ్స్, జింక్ ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి.. హార్మోన్లను ప్రేరేపించడంలో హెల్ప్ చేస్తాయి.
పుచ్చకాయ
పుచ్చకాయంలో సిట్రూల్లైన్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది సహజమైన వయాగ్రా వలె పనిచేసి రొమాంటిక్ లైఫ్‌ని ముందుకు తీసుకువెళ్లడంలో హెల్ప్ చేస్తుందట.
బెర్రీలు
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి మేలు చేసి.. లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో హెల్ప్ చేస్తాయి.
వెల్లుల్లి
ఇది రక్తప్రసరణను పెంచడంతో పాటు స్టామినాను మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి అల్లిసిన్ ప్రైవెట్ పార్ట్స్‌లో రక్తప్రసరణను పెంచి.. శృంగార జీవితానికి హెల్ప్ చేస్తుంది. అయితే లైంగిక చర్యకు ముందు దీనిని తీసుకోకపోవడమే మంచిది. ఎదుకంటే దీనిని వచ్చే వాసన మీ పార్టనర్‌కు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి డైట్లో భాగం చేసుకోవాలి.
గుడ్లు
గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. విటిమిన్ బి కూడా ఉంటుంది. ఇవి హార్మోన్లను రెగ్యూలేట్ చేసి ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలో లిబిడో స్థాయిలును పెంచుతాయి.
ఇవే కాకుండా అల్లం, డేట్స్, అవకాడోలు కూడా డైట్లో చేర్చుకుంటే మంచిది. ఇవి కూడా హార్మోన్లను బ్యాలెన్స్ చేసి.. శృంగార స్థాయిని మెరుగుపరుస్తాయి. ఈ ఫుడ్స్‌ని బ్యాలెన్స్డ్ డైట్లో భాగంగా తీసుకుంటే మంచిది. అంతేకాకుండా హైడ్రేటెడ్‌గా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌కి దూరంగా ఉండడంతో పాటు.. నిద్రకు ప్రాధన్యత ఇవ్వాలి. ఇవన్నీ మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి.






















