అన్వేషించండి

Anti-Ageing Superfood : నిత్య యవ్వనం కావాలా? ఈ ఆహారాన్ని ఫుడ్‌లో చేర్చండి, ఎప్పటికీ యంగ్‌గా ఉంటారు!

Anti-Ageing Superfood : సూపర్ ఫుడ్స్ తినడం ద్వారా మనం నిత్య యవ్వనంగా ఉంటామని నిపుణులు చెబుతుంటారు. అలాంటి సూపర్ ఫుడ్స్ లో చిక్కుడు గింజలు లేదా బీన్స్..వీటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం

Anti-Ageing Superfood : వయసుతోపాటు యవ్వనం కూడా కరిగిపోవడం సహజమే కానీ మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా చిన్న వయసులోనే వృద్ధాప్య చాయలు మనిషిని వెంటాడుతున్నాయి. 40 సంవత్సరాలు నిండే నాటికి వృద్ధాప్యపు ఛాయలు ప్రారంభం అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడాలంటే మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే మీరు నిత్య యవ్వనంతో ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తిన్నట్లయితే మీ వయసు మీరకుండా ఎక్కువ కాలం యవ్వనంతో ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి ఆహార పదార్థాల్లో చిక్కుడు గింజలు లేదా బీన్స్ గింజలు ముఖ్యమైనవి. వీటిని తరచూ మీ డైట్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటే మీ శరీరానికి సరిపోయే పోషక పదార్థాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు మీ యవ్వనం కూడా కొనసాగుతుందని, శరీరం అన్ని విధాలుగా సహకరిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

పోషకాల గని బీన్స్:

చిక్కుడు లేదా బీన్స్ గింజలు మీ శరీరానికి ఎంతో తోడ్పడతాయి. ఇవి యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండటంతో పాటు పలు పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ముఖ్యంగా చిక్కుడు జాతికి చెందిన అనేక రకాల బీన్స్ గింజల్లో బ్లాక్ బీన్స్,  శనగలు,  రాజ్మా గింజలు,  సోయాబీన్స్ వంటివి ప్రముఖంగా ఉంటాయి. ఇవి వృక్ష ఆధారిత ప్రోటీన్లతో పాటు విటమిన్లు మినరల్స్, ఫైబర్ కలిగి ఉంటాయి. ఈ పోషకాలు మీ ఆహార మీ ఆరోగ్యాన్ని పెంపొందేందుకు ఉపయోగపడతాయి. 

చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే బీన్స్:

బీన్స్ గింజలు చర్మ ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చర్మం ముడతలు పడకుండా ఇవి యాంటీ ఆక్సిడెంట్ విడుదల చేస్తాయి. ఈ గింజల్లో విటమిన్ సి, ఈ  పుష్కలంగా ఉంటాయి. ఇవి  ఒత్తిడి నుంచి మీ చర్మాన్ని కాపాడుతాయి. అలాగే విటమిన్ బి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే చర్మం కాంప్లెక్సేషన్, ముడతలు పడకుండా కాపాడుతుంది. 

 ఎముకల ఆరోగ్యానికి బీన్స్:

వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలం కోల్పోతుంటాయి. ఇలాంటి సమయంలో బీన్స్ అనేక పోషకాలను అందించడం ద్వారా మీ ఎముకలను  పటుత్వం కోల్పోకుండా కాపాడుతాయి. ముఖ్యంగా బీన్స్ లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటివి ఎముకలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

గుండె ఆరోగ్యానికి బీన్స్:

వయసు పెరిగే కొద్దీ ఉండకూడదు బలహీనపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు.  మారుతున్న జీవనశైలి కారణంగా గుండె ఆరోగ్యం ప్రతి ఒక్కరికి సమస్యగా మారుతుంది. ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్ నిలువలను రక్తంలో తగ్గించుకునేందుకు ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు గింజల్లో ఉండే డైటరీ ఫైబర్.. మీ రక్తాన్ని శుద్ధి చేసి కొలెస్ట్రాల్ నిల్వలను కంట్రోల్ చేస్తుంది. తద్వారా చెడు కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. అలాగే బీన్స్ లో ఉండే పొటాషియం మీ రక్తపోటును సైతం కంట్రోల్ చేస్తుంది.

బరువు తగ్గడానికి బీన్స్:

సాధారణంగా బరువు తగ్గడానికి చాలామంది భోజనం మానేస్తుంటారు. కానీ ఇలా చేయడం చాలా తప్పు అని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు బదులుగా ప్రోటీన్లు పుష్కలంగా ఉండి ఫైబర్ సైతం ఉండే ఆహార పదార్థాలు తినడం ద్వారా రక్తంలో కొవ్వు శాతం తగ్గి బరువు దించుకునే ప్రయత్నం చేయాలి నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకు సరైన ప్రత్యామ్నాయం బీన్స్ అనే చెప్పవచ్చు.

Also Read : బరువు తగ్గాలనుకుంటే కొత్తిమీర రైస్​ ట్రై చేయండి.. రెసిపీ ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget