Tips for Beach Trip : బీచ్ ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇవి మీతో కచ్చితంగా తీసుకువెళ్లండి.. ఎందుకంటే
Beach Essentials : చాలామందికి బీచ్‌లంటే ఇష్టముంటుంది. అయితే మీరు కూడా అలా బీచ్ ట్రిప్‌కి వెళ్లాలనుకుంటే మీతో పాటు ఈ వస్తువులు కూడా తీసుకెళ్లండి. ఎందుకో ఇప్పుడు చూసేద్దాం.
Beach Trip Essentials : సన్ సెట్ అయినా.. సన్ రైజ్ అయినా.. బీచ్ దగ్గరుంటే ఈ రెండూ సమయాలు స్వర్గమనే చెప్పొచ్చు. అందుకేనేమో చాలామంది బీచ్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతూ ఉంటారు. చలికాలమైనా, వేసవికాలమైన బీచ్లనేవి ఎప్పుడూ బోర్ కొట్టవు. సీజన్‌తో సంబంధం లేకుండా బీచ్‌కి వెళ్లేవారు కూడా ఉన్నారు. అయితే మీరు బీచ్‌కి వెళ్లేప్పుడు కొన్ని జాగ్రత్తలు ఫాలో అవ్వకపోతే.. మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే నెక్స్ట్ టైమ్ బీచ్‌కి వెళ్లేప్పుడు కచ్చితంగా కొన్ని వస్తువులు తీసుకువెళ్లండి. అవేంటంటే..
డ్రై టవల్
కచ్చితంగా బీచ్‌కి వెళ్లేప్పుడు తీసుకువెళ్లాల్సిన వాటిలో డ్రై టవల్ ఒకటి. మీరు నీటిలో తడిచిన వెంటనే బాడీని తుడుచుకునేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. లేదంటే ఉప్పు నీరు శరీరంపై డర్ట్ పేరుకుపోయేలా చేస్తుంది. పైగా నార్మల్ టవల్లాగా కాకుండా చాలా త్వరగా డ్రై అయిపోతుంది కాబట్టి.. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. టవల్కి బదులుగా వీటిని ఉపయోగిస్తే చాలా బెస్ట్ ఆప్షన్.
వెనిగర్, దూది
బీచ్‌కి వెళ్లేప్పుడు వెనిగర్ చిన్న బాటిల్, దూది తీసుకువెళ్తే మంచిది. ఎందుకంటే.. బీచ్‌లలో కొందరు జెల్లి ఫిష్ స్టింగ్స్తో ఇబ్బంది పడుతుంటారు. ఆ సమయంలో దానిపై వెనిగర్ పోస్తే నొప్పి తగ్గుతుంది. అలాగే బ్యాండేజ్‌లు, వైప్స్, పెయిన్ రిలీవర్స్ కూడా మీ లగేజ్‌లో ఉండేలా చూసుకోండి.
సన్‌స్క్రీన్
బీచ్‌లకు వెళ్లినప్పుడు కచ్చితంగా తీసుకువెళ్లాల్సిన వాటిలో సన్‌స్క్రీన్ ముందు ఉంటుంది. ఎందుకంటే వాటర్‌లో తడవడం, ఉప్పు, ఇసుక వల్ల చర్మం త్వరగా డార్క్ అయిపోతుంది. పైగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల స్కిన్ టోన్ మారిపోతుంది. డ్రైగా అయిపోతుంది. కాబట్టి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్ కచ్చితంగా ఉపయోగించాలి. రెగ్యూలర్‌గా ముఖానికే ఉపయోగించినా.. బీచ్‌లకు వెళ్లేప్పుడు శరీరం మొత్తానికి సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే మంచిది. SPF 50 ఉండే సన్ స్క్రీన్లు ఎంచుకోవడం మంచిది.
వాటర్ ప్రూఫ్ ఫోన్ పౌచ్
బీచ్‌కి వెళ్లినప్పుడు ఫోటోలు దిగకుండా ఉండలేము. కానీ నీటిలో ఫోన్స్ తడిచిపోతే.. అదొక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి బీచ్ ట్రిప్‌కి వెళ్లేప్పుడు వాటర్ ప్రూఫ్ ఫోన్ పౌచ్‌లు ఉపయోగిస్తే మంచిది. వాటర్ గేమ్స్ ఆడేప్పుడు కూడా ఇది మీకు హెల్ప్ ఫుల్‌గా ఉంటుంది.
Also Read : సమ్మర్ స్పెషల్ లుక్స్.. బీచ్ నుంచి ఫంక్షన్లవరకు ఇలాంటి డ్రెస్‌లను ఎంచుకుంటే అదిరిపోతారంతే
స్నార్కెలింగ్ గేర్
మీరు సముద్రంలో డైవ్ చేయాలనుకుంటే కచ్చితంగా Snorkeling Gear ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇది మీకు తక్కువ కాస్ట్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇవి మీరు స్విమ్ చేస్తున్నప్పుడు ఇబ్బంగి లేకుండా చేస్తాయి.
వీటంన్నిటినీ కచ్చితంగా మీ బీచ్ ట్రిప్‌లో ఉండేలా చూసుకోండి. వీటివల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. అలాగే బీచ్ నుంచి రూమ్‌కి వెళ్లిన తర్వాత కచ్చితంగా స్నానం చేస్తే మంచిది. అలాగే స్విమ్ చేసేప్పుడు నీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ మింగకూడదు. ఇవన్నీ మీ బీచ్ ట్రిప్‌ని బాగా ఎంజాయ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.
Also Read : హైదరాబాద్ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్‌కి ప్లాన్ ఇదే