అన్వేషించండి

Bathukamma Special Recipes: తొమ్మిది రోజులు బతుకమ్మ ఇష్టపడే నైవేద్యాలు ఇవే, నిమిషాల్లో రెడీ చేసేయచ్చు

బతుకమ్మను తొమ్మిది రోజులు పండుగల నిర్వహిస్తారు. ప్రతి రోజు ఒక నైవేద్యాన్ని ప్రత్యేకంగా నివేదిస్తారు.

మొదటి రోజు - ఎంగిలి పూల బతుకమ్మ
నైవేద్యం - నువ్వుల పిండి, బియ్యం పిండితో చేసే ప్రసాదం 
తయారీ: కప్పు నువ్వులు తీసుకుని కళాయిలో వేయించాలి. బ్రౌన్ రంగులోకి వచ్చాక తీసి పంచదార వేసి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో బియ్యంపిండి, నూకలు కూడా కలుపుకోవచ్చు. ఇదే ఎంగిలిపూల బతుకమ్మకు సమర్పించే నైవేద్యం. 

రెండో రోజు - అటుకుల బతుకమ్మ
నైవేద్యం - సప్పిడి పప్పుతో పాటూ బెల్లం - అటుకులు     
తయారీ- ముందుగా సప్పిడి పప్పు తయారుచేసుకోవాలి. కందిపప్పును కాస్త పసుపు కలిపి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. నెయ్యితో ఆ పప్పును తాళింపు వేసుకోవాలి. ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేయకూడదు. ఇది సప్పిడి పప్పు కాబట్టి కారం ఉండకూడదు. 

ఇక బెల్లం - అటుకుల రెసిపీ కోసం ముందుగా కళాయిలో నెయ్యివేసి  జీడిపప్పులు, కిస్మిస్, బాదం వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో బెల్లం వేసి కరిగించుకోవాలి. అవి కరిగాక అటుకులను శుభ్రం చేసి మరీ మెత్తగా నానిపోకుండా తీసి బెల్లంలో వేసి కలిపేయాలి. పైన ముందుగా వేయించిన డ్రైఫ్రూట్స్ ను చల్లుకోవాలి. అంతే బెల్లం - అటుకుల ప్రసాదం రెసిపీ రెడీ. 

మూడో రోజు - ముద్దపప్పు బతుకమ్మ
నైవేద్యం - ముద్దపప్పు
తయారీ - కుక్కర్లో కందికపప్పు, పసుపు, కరివేపాకులు, దంచిన జీలకర్ర, ఒక స్పూను నూనె, నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికాక ఉప్పు కలుపుకోవాలి. ముద్ద ప్రసాదం సిద్ధమైనట్టే. 

నాలుగో రోజు - నానబియ్యం బతుకమ్మ
నైవేద్యం - బెల్లమన్నం లేదా పరమాన్నం
తయారీ - ఒక కప్పు బియ్యాన్ని మూడు కప్పుల పాలలో ఉడికించాలి. పాలలో బియ్యం ఉడకవు అనుకుంటే రెండు ఒకటిన్నర కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు వేయచ్చు. మరో పక్క కళాయిలో బెల్లాన్ని కరిగించుకోవాలి. అలాగే నెయ్యిలో డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అన్నం ఉడికాక చివర్లో కరిగించిన బెల్లంపాకాన్ని వేసి కలపాలి. స్టవ్ ఆపేయాలి. బెల్లంగా బాగా కలిశాక పైన ముందుగా వేయించిన డ్రైఫ్రైట్స్ వేయాలి. అంతే బెల్లమన్నం రెడీ అయింది. 

అయిదో రోజు - అట్ల బతుకమ్మ
నైవేద్యం - అట్లు లేదా దోశెలు
తయారీ - ఈ రోజు ప్రసాదం చేయడం చాలా సులువు. ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునే అట్లు లేదా దోశెలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే బియ్యంపిండితో చేసిన అట్లు పెడితే మంచిదని చెబుతారు. దీనికి ఒక గిన్నెలో  కప్పు బియ్యంపిండి, పావు కప్పు రవ్వ, పావు కప్పు పెరుగు, జీలకర్ర, తగినంత నీళ్లు వేసి బాగా కలపాలి. దోశె పిండిలా జారేలా కలుపుకోవాలి. పదినిమిషాలు పక్కన పెట్టాక ఆ రుబ్బుతో అట్లు లేదా దోశెలు వేసి అమ్మవారికి సమర్పించుకోవాలి.   

ఆరో రోజు - అలిగిన బతుకమ్మ
నైవేద్యం - ఈ రోజు ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించరు

ఏడో రోజు - వేపకాయల బతుకమ్మ 
నైవేద్యం - బియ్యంపిండితో చేసే వేపకాయలు ప్రసాదం
తయారీ  - ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యంపిండి, రెండు స్పూన్ల నువ్వులు, తగినంత ఉప్పు వేసి కలపాలి. అందులో గోరువెచ్చని నీళ్లు వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ ముద్దను వేపకాయల్లా చేతితో నొక్కుకుని నూనెలో వేయించాలి. అంతే వేపకాయల ప్రసాదం సిద్ధమైంది. 

ఎనిమిదో రోజు - వెన్నముద్దల బతుకమ్మ
నైవేద్యం - వెన్నముద్దలు
తయారీ - వెన్నముద్దలు చేసేందుకు గిన్నెలో అరకప్పు బియ్యంపిండి వేయాలి. అందులో రెండు స్పూన్ల బటర్ వేయాలి. పిండిలో బటర్ బాగా కలిపేయాలి. కాస్త వేడి నీళ్లు కలుపుకుని చపాతీ పిండిలా వచ్చే వరకు నలపాలి. ఇప్పుడు చిన్న ముద్ద తీసి గులాబ్ జాముల్లా గుండ్రంగా చుట్టుకోవాలి. అలా గుండ్రని ముద్దలు రెడీ అయ్యాక వాటిని నూనెలో వేయించాలి. మరో పక్క పంచదార పాకం తీసుకోవాలి. వేయించిన వెన్నముద్దలను తీసి ఆ పాకంలో వేయాలి. అమ్మవారికి తీయని వెన్నముద్దల నైవేద్యం రెడీ అయినట్టే. 

తొమ్మిదో రోజు - సద్దుల బతుకమ్మ
నైవేద్యం - కొబ్బరన్నం, నువ్వుల సద్ది, నిమ్మకాయ పులిహరో, చింతపండు పులిహోర, దద్దోజనం... ఇలా నచ్చిన నైవేద్యాలను చేస్తారు. వీటి రెసిపీలను సెపరేట్‌గా ఇచ్చాం.

Also read: నువ్వుల సద్ది, సద్దుల బతుకమ్మ స్పెషల్ నైవేద్యం, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది 

Also read: బతుకమ్మని పూలతోనే ఎందుకు పేరుస్తారు, తప్పనిసరిగా వినియోగించాల్సిన పూలు ఏవి!

టాప్ హెడ్ లైన్స్

Iron-Rich Foods : ఐరన్ లోపం ఉంటే ఇడ్లీ, దోశ తినవచ్చా? ఈ తప్పులు చేస్తే శోషణ కష్టమే
ఐరన్ లోపం ఉంటే ఇడ్లీ, దోశ తినవచ్చా? ఈ తప్పులు చేస్తే శోషణ కష్టమే
Brain Health and Memory : తరచూ విషయాలు మర్చిపోతున్నారా? మతిమరుపు ఎక్కువైతే ఈ ఫుడ్ కాంబినేషన్స్‌ ట్రై చేయండి
తరచూ విషయాలు మర్చిపోతున్నారా? మతిమరుపు ఎక్కువైతే ఈ ఫుడ్ కాంబినేషన్స్‌ ట్రై చేయండి
Quinoa Khichdi Recipe : క్వినోవా కిచిడీ ఇలా చేసుకోండి.. రుచితో పాటు ఆరోగ్యానికి ప్రయోజనాలు ఇచ్చే రెసిపీ ఇదే
క్వినోవా కిచిడీ ఇలా చేసుకోండి.. రుచితో పాటు ఆరోగ్యానికి ప్రయోజనాలు ఇచ్చే రెసిపీ ఇదే
Flaxseed Gel : గ్లోయింగ్ స్కిన్ కోసం అవిసె గింజలతో DIY జెల్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని, అప్లై చేయండి
గ్లోయింగ్ స్కిన్ కోసం అవిసె గింజలతో DIY జెల్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని, అప్లై చేయండి

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Panjaa Re Release: జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Irumudi Collections : 200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
Hair Fall Treatment: జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
Embed widget