అన్వేషించండి

Salt Benefits : ఉప్పుతో ఆరోగ్యానికి ముప్పే, కానీ ఈ జబ్బును తగ్గిస్తోందట!

Salt Side Effects: ఉప్పు అతిగా తీసుకోవడం వల్ల ఎంత ముప్పు ఉందో.. అంతే మేలు కూడా ఉందట. కానీ, ఇది అందరికీ వర్తించదు సుమీ.

Salt Benefits in Telugu : ఉప్పు అతిగా తింటే ఆరోగ్యానికి ముప్పు అనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. కానీ, ఉప్పు ఎక్కువ తినడం వల్ల ప్రయోజనాలు కూడా ఉంటాయట. అది మరెవ్వరికో కాదు.. లోబీపీ రోగులకు.

లోబీపీ అనేది ఒక అసాధారణ సమస్య. కానీ దాన్ని మనం సీరియస్‌గా తీసుకోవడం లేదు. హై బీపీ లాగానే ఇది ప్రమాదాన్ని పెంచుతుంది. మీ బీపీ తక్కువగా ఉంటే, మీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. మీకు కళ్లు తిరగవచ్చు, మూర్ఛపోవచ్చు, వికారం అనిపించవచ్చు. కంటి చూపు అస్పష్టంగా మారవచ్చు. చిరాకుగా మారవచ్చు, పనిపై దృష్టి పెట్టలేరు. అలసిపోయినట్లు అనిపిస్తుంది. లో బీపీ  కారణంగా మీరు ఎదుర్కొనే అనేక సమస్యలు ఉన్నాయి. కానీ, ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ మనం లోబీపీని సీరియస్‌గా తీసుకోవడం లేదు. రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధుల కారణంగా లోబీపీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనందరికీ తెలిసినట్లుగా, బీపీ 120/80 ఉండాలి. నిజానికి మన బీపీ  130/90 కంటే తక్కువగా ఉండాలి. పెరుగుతున్న వయస్సుతో పాటు బీపీ కూడా పెరుగుతుంది.

బీపీ  పడిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు:

ఒక వ్యక్తి అతిసారం లేదా అకస్మాత్తుగా షాక్‌కు గురైతే అతడి బీపీ  త్వరగా తగ్గుతుంది. కొద్దిరోజుల్లో ఇది మళ్లీ సాధారణం అవుతుంది, శరీరంలో రక్త హీనత వల్ల కూడా బీపీ తగ్గితే, మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. 

లో బీపీ 90/60 గా రీడింగ్ వచ్చినట్లయితే మిమ్మల్ని లోబీపీ రోగిగా పరిగణించవచ్చు. అప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ వద్దకు వెళ్లవలసి ఉంటుంది. బీపీ సాధారణం కంటే తక్కువగా ఉంటే, మీ ముఖ్యమైన అవయవాలు ప్రభావితమవుతాయి. శరీరంలో ఆక్సిజన్ సరఫరా ప్రభావితం కావచ్చు.

లో బీపీ  రకాలు:

లో బీపీని అనేక వర్గాలుగా విభజించారు. మొదటి రకం ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఇందులో ఒక వ్యక్తి అకస్మాత్తుగా మంచం లేదా కుర్చీ నుంచి లేచినప్పుడు, అతని బీపీ  తగ్గుతుంది. దీని వెనుక కారణాలు డీ హైడ్రేషన్, సుదీర్ఘమైన బెడ్ రెస్ట్, గర్భం,  కొన్ని ప్రత్యేక వైద్య పరిస్థితులు కారణం కావచ్చు. ఈ రకమైన బీపీ వయస్సు పెరుగుతున్న కొద్దీ సాధారణం అని చెప్పవచ్చు. 

పోస్ట్‌ప్రాండియల్ హైపోటెన్షన్ :

ఇందులో ఆహారం తిన్న ఒకటి లేదా రెండు గంటల తర్వాత బీపీ తగ్గుతుంది . ఇది తరచుగా వృద్ధులలో కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా అధిక బీపీ  రోగులు ,  పార్కిన్సన్స్ వంటి వ్యాధులతో బాధపడేవారిలో కనిపిస్తుంది. 

ఉప్పు తింటే లోబీపీ సమస్య నయమవుతుంది:

ఉప్పు విషయానికొస్తే, మీరు ఉప్పును సాధారణ పరిమాణంలో తీసుకోవాలి. ప్రతి ఒక్కరు తన రుచి, అవసరాన్ని బట్టి ఉప్పు తీసుకోవాలి. సాధారణ స్థితిలో మన శరీరానికి ఉప్పు ,  తగినంత మొత్తంలో అయోడిన్ అవసరం. బీపీ ఎక్కువగా ఉన్నవారు కాస్త ఉప్పు ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడు లోబీపీ సమస్య నుంచి బయటపడవచ్చు. లోబీపీ అనిపించినప్పుడు ఓఆర్ఎస్ ద్రావణ తీసుకోవడం ద్వారా కూడా ఉప్పును భర్తీ చేసుకోవచ్చు. అలాగే బీపీ డౌన్ కాకుండా కాపాడుకోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Embed widget