అన్వేషించండి

Moringa for Healthy Skin : మునగాకుతో చర్మానికి ఎన్ని ప్రయోజనాలో.. అలా అప్లై చేస్తే మెరిసే స్కిన్ మీ సొంతం

Skincare Routine : అందానికి కాదేది అనర్హం అన్నట్లు మునగాకును కూడా బ్యూటీ కోసం ఉపయోగిస్తున్నారు. విచిత్రమేమిటంటే దీనివల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. 

Organic Skin Care : మునగాకుకు ఈ మధ్య బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఆరోగ్యానికై చాలామంది దీనిని తమ డైట్స్​లో చేర్చుకుంటున్నారు. పప్పు, కూరల్లో, సలాడ్స్​లో దీనిని లాగించేస్తున్నారు. అయితే ఇది కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచి ఫలితాలే ఇస్తుంది. మెరిసే, కాంతివంతమైన చర్మాన్ని అందించడంలో మునగాకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. జుట్టుకు కూడా ఇది ప్రభావవంతమైన ఫలితాలు ఇస్తుంది. 

మునగాకు మీరు జుట్టుకు లేదా చర్మానికి ఉపయోగించాలనుకుంటే.. మీరు ముందుగా ఓ పని చేయాలి. మునగాకులను కడిగి ఎండబెట్టాలి. అవి బాగా డ్రై అయినా తర్వాత పొడి చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడితో మీరు వివిధ రకాల బ్యూటీ మాస్క్​లు ప్రయత్నించవచ్చు. అయితే చర్మానికి మెరుపు కావాలనుకుంటే ఈ మునగాకును ఏవిధంగా ఉపయోగించాలో.. దానిలో ఏయే సహజ పదార్థాలు కలిపితే మంచి ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

తేనెతో కలిపి..

మీరు ఈ మాస్క్​ను తయారు చేసుకునేందుకు మునగాకు పొడిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల తేనెను కలపండి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యే వరకు కలిపి.. ముఖంపై మాస్క్ వేయండి. దీనిని పది నుంచి 15 నిమిషాలు ఉంచి.. గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తే మీ ముఖంపై ఉన్న టాన్​ తొలగి.. చర్మం హైడ్రేటెడ్​గా ఉంటుంది. 

సీరం వలె..

చర్మం కాంతివంతంగా ఉండేందుకు సీరమ్​లు బాగా పనిచేస్తాయి. మీ చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచుకునేందుకు మీరు మెరింగా ఆయిల్ సీరమ్​ను తయారు చేసుకోవచ్చు. మోరింగా నూనెను రోజ్​షిప్​ ఆయిల్, లావెండర్​తో కలపండి. దీనిని మీ రెగ్యూలర్ స్కిన్​ కేర్​లో ఉపయోగించుకోవచ్చు. దీనిలోని అద్భుతమైన లక్షణాలు మీ చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి. 

ఓట్​ మీల్​..

ఎక్స్​ఫోలియేషన్ చేస్తే చర్మంపైన ఉన్న మృతకణాలు తొలగి.. స్కిన్​కు మెరుపు అందుతుంది. అయితే మీరు మునగాకు పొడిని స్క్రబ్​గా ఉపయోగించవచ్చు. దీనికోసం ఓ గిన్నెలో మునగాకు పొడిని తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్, తేనె వేసి బాగా కలపండి. అవన్నీ మిక్స్ అయిన తర్వాత చర్మంపై సున్నితంగా మసాజ్ చేయండి. కేవలం ముఖానికే కాకుండా చర్మానికి కూడా దీనిని అప్లై చేయవచ్చు. ఇది మీకు మెరిసే, మృదువైన చర్మాన్ని అందించడంలో హెల్ప్ చేస్తుంది. 

అవకాడో మిక్స్

ఓ గిన్నె తీసుకుని దానిలో మునగాకు పొడి వేయాలి. దానిలో అవకాడో పేస్ట్ వేసి బాగా కలపాలి. దీనిని మీరు ముఖానికి అప్లై చేస్తే చర్మం సహజంగా మెరుస్తుంది. అంతేకాకుండా అవకాడోలోని పోషకగుణాలు చర్మానికి చాలా మంచి ప్రయోజనాలు అందిస్తాయి. 

ముల్తానీ మట్టితో..

ముల్తానీ మట్టి చర్మ ప్రయోజనాలు అందించడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. దీనిని మునగాకు పొడితో కలిపితే దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఇది మీకు హైడ్రా ఫేషియల్ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ మాస్క్ చేయడం కోసం ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిలో కొన్ని రోజ్ వాటర్, మునగాకు పొడివేసి బాగా కలపండి. దీనిని ముఖానికి అప్లై చేయండి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై ఉన్న మలినాలు, మురికిని తొలగిస్తుంది. దీనివల్ల మీరు మెరిసే, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. 

Also Read : వాలెంటైన్స్ వీక్ స్పెషల్.. ఒక్కోరోజు ఒక్కోలా ప్రేమను వ్యక్తం చేసేయండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget