అన్వేషించండి

Andhra Style Tomato Pappu : ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే

Andhra Tomato Dal Recipe : ఆంధ్రా స్టైల్ టమాటా పప్పును ఇంట్లోనే రుచిగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం, పప్పు రుచి పెంచే వంట చిట్కాలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కందిపప్పును నానబెట్టి, పసుపు, పండిన టమాటాలతో ఉడికించండి.
  • ఉడికిన టమాటాలు మెదిపి, పులుపును బట్టి చింతపండు కలపాలి.
  • వెల్లుల్లి, ఆవాలు, జీలకర్రతో తాలింపు వేసి పప్పులో కలపాలి.
  • కొత్తిమీర, నెయ్యితో కలిపి వేడి అన్నంలో వడ్డిస్తే రుచి.

Tomato Pappu Recipe : ఆంధ్రా భోజనం అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చే వంటకాల్లో టమాటా పప్పు కూడా ఒకటి. వేడివేడి అన్నంలో టమాటా పప్పు, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే ఇంట్లో చేసేటప్పుడు హోటల్‌లో లేదా పల్లెటూళ్లలో చేసే పప్పులా రుచి రావడం లేదా? కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే టమాటా పప్పును మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో.. ఎలా వండుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

టమాటా పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు

కందిపప్పు - 1 కప్పు

టమాటాలు - 4

పచ్చిమిర్చి - 2

ఉల్లిపాయ - 1 

పసుపు - పావు టీస్పూన్

చింతపండు - టమాటాల పులుపును బట్టి తీసుకోవాలి.

Also Read : పొట్లకాయతో ఇలా పప్పు చేసుకోండి.. వేడి వేడి అన్నంలో, వడియాల కాంబినేషన్​తో తింటే ఆ రుచే వేరు

వెల్లుల్లి రెబ్బలు - 6

ఎండుమిర్చి - 2

ఆవాలు - అర టీస్పూన్

జీలకర్ర - అర టీస్పూన్

కరివేపాకు - 2 రెమ్మలు

ఇంగువ - చిటికెడు

నూనె - 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు - తగినంత

కొత్తిమీర - కొద్దిగా

Also Read : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

టమాటా పప్పు తయారీ విధానం

టమాటా పప్పు రుచిగా రావాలంటే పప్పు మెత్తగా ఉడకడం చాలా ముఖ్యం. కాబట్టి కందిపప్పును కడిగి 15 నుంచి 20 నిమిషాలు నానబెడితే.. త్వరగా మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్‌లో పసుపు, తగినంత నీరు వేసి పప్పు మెత్తగా ఉడికించండి. టమాటాలే ఈ పప్పుకు ప్రధాన రుచిని ఇస్తాయి. కాబట్టి బాగా పండిన, రసంతో ఉండే టమాటాలను తీసుకోండి. టమాటాలను ముక్కలుగా కోసి పప్పుతో కలిపి ఉడికించవచ్చు. ఇలా చేస్తే టమాటాల రసం పప్పులోకి బాగా చేరుతుంది.

టమాటాలు పూర్తిగా మెత్తబడి, తొక్క విడిపోయేంత వరకు ఉడికిస్తే పప్పులో వాటి రుచి బాగా కలుస్తుంది. టమాటా ముక్కలు గట్టిగా ఉండకుండా గరిటెతో కొద్దిగా మెదపండి. దీనివల్ల పప్పుకు మంచి చిక్కదనం వస్తుంది. ఆంధ్రా స్టైల్ టమాటా పప్పులో పులుపు ముఖ్యమైన రుచి. అయితే టమాటాలే ఎక్కువ పుల్లగా ఉంటే చింతపండు అవసరం ఉండకపోవచ్చు. టమాటాలు తక్కువ పుల్లగా ఉంటే కొద్దిగా చింతపండు రసం కలపండి. ఒకేసారి ఎక్కువ వేయకుండా రుచి చూసుకుంటూ కలపడం మంచిది.

Also Read : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే

టమాటా పప్పుకు వెల్లుల్లి మంచి సువాసన, రుచిని ఇస్తుంది. కాబట్టి తాళింపు వేసేప్పుడు వెల్లుల్లిని మంచిగా వేపుకోవాలి. చిన్న కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించండి. వెల్లుల్లి కొద్దిగా బంగారు రంగులోకి వచ్చాక తాలింపును పప్పులో కలపండి. వెల్లుల్లి మాడిపోకుండా చూసుకోండి. పచ్చిమిర్చి పప్పుకు తాజా ఘాటు ఇస్తే, ఎండుమిర్చి తాలింపులో మంచి సువాసనను అందిస్తుంది. మీకు కారం ఎంత కావాలో చూసుకుని దానికి తగ్గట్లు ఇవి వేసుకోవాలి. 

పప్పులో ఈ తాళింపు వేసేసి.. చివర్లో కొద్దిగా కొత్తిమీర వేయండి. అంతే నోరూరించే టమాటా పప్పు రెడీ. వేడివేడి అన్నంలో వడ్డించేటప్పుడు ఒక చిన్న చెంచా నెయ్యి కలిపితే రుచి మరింత బాగుంటుంది. వడియాలు, లేదా ఆవకాయతో కలిపి తింటే ఏ రుచి అయినా తలవంచాల్సిందే అన్న ఫీల్ వస్తుంది. 

Also Read : ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Healthy Habits : రోజుకు 10 నిమిషాలు కేటాయిస్తే చాలు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సింపుల్ అలవాట్లు ఇవే
రోజుకు 10 నిమిషాలు కేటాయిస్తే చాలు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సింపుల్ అలవాట్లు ఇవే
Kalonji Oil : కలొంజీ ఆయిల్ జుట్టుకు ఉపయోగిస్తే కలిగే లాభాలు ఏంటి? ఎలా వాడాలో తెలుసా?
కలొంజీ ఆయిల్ జుట్టుకు ఉపయోగిస్తే కలిగే లాభాలు ఏంటి? ఎలా వాడాలో తెలుసా?
Late-Night Eating : రాత్రి భోజనం.. నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? గ్యాస్ట్రో వైద్యులు ఏం చెబుతున్నారంటే..
రాత్రి భోజనం.. నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? గ్యాస్ట్రో వైద్యులు ఏం చెబుతున్నారంటే..
Backward Walking : వెనక్కి నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎప్పుడు, ఎంత సేపు నడిస్తే మంచిది?
వెనక్కి నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎప్పుడు, ఎంత సేపు నడిస్తే మంచిది?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
Ishan Kishan Out: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Arnab Cyclone: ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Embed widget