అన్వేషించండి

Vaccine: పిల్లలకే కాదు పెద్దలకు టీకాలు అవసరమే, కచ్చితంగా తీసుకోవాల్సిన కీలకమైన టీకాలు ఇవిగో

టీకాలు అనగానే పిల్లలకే అనుకుంటాం, కానీ పెద్దలకు కూడా టీకాలు ఉన్నాయి.

సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయానికి టీకాలు వేయడానికి ప్రాధాన్యతను ఇస్తారు. తమ గురించి మాత్రం పట్టించుకోరు. పిల్లలకు వయసుకు తగ్గట్టు వేయించాల్సిన కొన్ని ముఖ్యమైన టీకాలు ఉన్నట్టే, పెద్దలకు కూడా వ్యాక్సిన్లు ఉన్నాయి. కానీ వీటిని తీసుకునేందుకు పెద్దలు ఆసక్తి చూపించడం లేదు. ఆధునిక కాలంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు తట్టుకోవాలంటే కచ్చితంగా అన్ని రకాల టీకాలు తీసుకోవాల్సిందే. వీటిని ఉచితంగా వేసే అవకాశం తక్కువ. ఎంతో కొంత రుసుము చెల్లించే ఈ టీకాలను తీసుకోవాలి. పెద్దలు కచ్చితంగా తీసుకోవాల్సిన టీకాల జాబితా ఇదిగో.

గర్భాశయ క్యాన్సర్ టీకా 
ఇది కేవలం మహిళలకు మాత్రమే వేసే టీకా. దీన్ని ప్రతి మహిళా కచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే 2019లో గర్భాశయ క్యాన్సర్ కారణంగానే 45 వేల మందికి పైగా మహిళలు మరణించారు.  ప్రతి లక్ష మంది మహిళల్లో 19 మందికి గర్భాశయ క్యాన్సర్ వస్తున్నట్టు అంచనా.  కాబట్టి ప్రతి మహిళా ఈ టీకాను తీసుకోవాలి.  గర్భాశయ క్యాన్సర్ నివారణకు మన దేశం ఇటీవల మొట్టమొదటి స్వదేశి టీకాను పరిచయం చేసింది. 

టెటనస్ షార్ట్
టెటనస్... దీన్ని తెలుగులో ధనుర్వాతం అంటారు.  క్లోస్ట్రిడియం అనే బాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. కండరాలు సంకోచించి చాలా బాధాకరంగా మారుతాయి. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే టీకా అందుబాటులో ఉంది. 18 ఏళ్ల దాటిన వారు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తీసుకోవడం చాలా ముఖ్యం. 

ఫ్లూ వ్యాక్సిన్
ఫ్లూ గురించి ఎవరు అంతగా పట్టించుకోరు. వచ్చినా తగ్గిపోతుందిలే అనుకుంటారు. కానీ కోవిడ్ లాంటి వైరస్‌లు దాడి చేశాక ఫ్లూ కూడా ప్రాణాంతకమైనదని అర్థమైంది. కాబట్టి పెద్దలందరూ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ ఫ్లూ షాట్ ప్రతి సంవత్సరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావు. 

నిమోనియా వ్యాక్సిన్
మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వంటి రోగాలతో పోరాడుతున్న పెద్దలు ఏ వయసులోనైనా నిమోనియా బారిన పడే ప్రమాదం ఎక్కువ. అలాగే 65 ఏళ్ల కంటే వయసు ఎక్కువ ఉన్నవారు కూడా నిమోనియాతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వీరంతా కూడా నిమోనియా వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి. దీనికోసం రెండు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు టీకాలు రకరకాల బ్యాక్టీరియాలనుంచి రక్షణ కల్పిస్తాయి. 

మరికొన్ని...
భారతదేశంలో పైన చెప్పిన వ్యాక్సిన్లతో పాటు పెద్దలు మరికొన్ని టీకాలు వేయించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. హేమోఫ్లస్ ఇన్ఫ్లుఎంజా టైప్ B వ్యాక్సిన్, హెపటైటిస్ A టీకా, హెపటైటిస్ B టీకా, హ్యూమన్ పాపిల్లోమావైరస్ టీకా, మెనింగోకాకల్ టీకా, న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్, వరిసెల్లా టీకా, టెటానస్, డిప్తీరియా వ్యాక్సిన్, రోబెల్లా వాక్సీన్ వేయించుకోవాలి. 

Also read: థైరాయిడ్ సమస్య త్వరగా అదుపులోకి రావాలంటే వీటిని తీసుకోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Samantha: బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Embed widget