WII: వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో 11 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 11 పోస్టులను భర్తీ చేయనున్నారు.
![WII: వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో 11 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు Wildlife Institute of India has released notification for the recruitment of Project Staff Posts WII: వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో 11 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/918d77016ea34e87802204a81d8a99401690520168839522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 18వ తేదీ వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 11
* ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
పోస్టుల వారీగాఖాళీలు..
▶ ప్రాజెక్ట్ సైంటిస్ట్- II (ఎకాలజీ): 01
వ్యవధి: 05
▶ ప్రాజెక్ట్ అసోసియేట్ – I (ఎకాలజీ): 04
వ్యవధి: 05
▶ ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్(ఎకాలజీ): 01
వ్యవధి: 01
▶ ప్రాజెక్ట్ అసోసియేట్ – I(ఎకాలజీ):03
వ్యవధి: 01
▶ రీసెర్చ్ అసోసియేట్ – I(ఎకాలజీ): 01
వ్యవధి: 01
▶ ప్రాజెక్ట్ అసోసియేట్ – I(ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్): 01
వ్యవధి: 03
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 35-40 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు రూ.31000-రూ.67000 చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18.08.2023.
చిరునామా: Dr. Bilal Habib, Dept. of Animal Ecology & Conservation Biology Wildlife Institute of India, Chandrabani, Dehradu - 248 002 (Uttarakhand).
ALSO READ:
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 132 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
ముంబయిలోని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఎన్‌ఐఏసీఎల్) దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్ శాఖల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(స్కేల్-1) పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకి ఆగస్టు1వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)