By: ABP Desam | Updated at : 02 May 2023 01:27 PM (IST)
Edited By: omeprakash
యూపీఎస్సీ ఎన్డీఏ ఫలితాలు 2023
UPSC NDA Results 2023: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC NDA & NA (1) - 2023) నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ రాతపరీక్ష ఫలితాలు మే 2న విడుదలయ్యాయి. ఏప్రిల్16న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్డీఏ రాతపరీక్షకు హాజరైన అభ్యర్ధులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మొత్తం 395 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల మార్కుల వివరాలను 15 రోజుల్లో వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. అదేవిధంగా తర్వాతి దశలో ఇంటర్వ్యూలు పూర్తయిన 30 రోజుల్లోగా తుది ఎంపిక ఫలితాలను వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది.
UPSC NDA-1 2023 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?
🔰 ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్: https://www.upsc.gov.in ఓపెన్ చెయ్యాలి.
🔰హోమ్‌పేజ్‌లో కనిపించే 'NDA & NA Written Results' ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి.
🔰 క్లిక్ చేయగానే 'ఎన్డీఏ 1 - 2023' ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్ కనిపిస్తుంది.
🔰 ఎన్డీఏ-1 ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
🔰 మీ పేరును చెక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్‌తో చెక్ చేసుకోవాలి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడెమీ(NDA) 151వ కోర్సు, నేవల్ అకాడమీ(NA) 113వ కోర్సుల్లో ప్రవేశాలకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుండి 2022 జనవరి 10 వరకు అవివాహిత పురుష/మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 395 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న రాతపరీక్ష నిర్వహించింది. పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించింది. ఉదయం 10 గంటల నుండి మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండో సెషన్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ పరిధిలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
సందేహాలుంటే సంప్రదించవచ్చు..
🔰 అభ్యర్థులకు ధ్రవపత్రాల పరిశీలన, విద్యార్హతలు తదితర విషయాల్లో ఏమైనా సందేహాలుంటే 011-23385271/011- 23381125/011-23098543 ఫోన్ నెంబర్లలో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 17:00 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించవచ్చు.
🔰 ఇంటర్వ్యూకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 011-26175473, 011-23010097 నెంబర్లు లేదా joinindianarmy.nic.in for Army, Emai: officer-navy@nic.in ద్వారా సంప్రదించవచ్చు.
🔰 అదేవిధంగా నేవీ/నేవల్ అకాడమీకి సంబంధించిన సమస్యలపై 011-010231 Extn.7645/7646/7610 ఫోన్ నెంబర్లు లేదా joinindiannavy.gov.in లేదా www.careerindianairforce.cdac.in ద్వారా సంప్రదించవచ్చు.
Also Read:
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో 322 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు, అర్హతలివే!
కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ తదితర దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి "సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2023" నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా 322 పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఏప్రిల్ 26న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మే 16 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్‌లో 212 సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు- అర్హతలివే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్- బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎస్‌ఐ పోస్టులకు రూ.200, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!
EFLU: ఇఫ్లూలో 132 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, అర్హతలివే!
Railway Apprenticeship: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్‌పూర్‌లో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!
NERIST: అరుణాచల్‌ప్రదేశ్ ఎన్‌ఈఆర్‌ఐఎస్‌టీలో 32 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
SCTIMST: తిరువనంతపురం ఎస్‌సీటీఐఎంఎస్‌టీలో 30 జనరల్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?
Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!
Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్
Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం