UPSC: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు- ఈ అర్హతలుండాలి
UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 16వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 17
⏩ అసిస్టెంట్ డైరెక్టర్(రిమోట్ సెన్సింగ్): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంటెక్ (రిమోట్ సెన్సింగ్ లేదా జియోమాటిక్స్ లేదా జియోఇన్ఫర్మేటిక్స్) ఏదైనా బ్రాంచ్‌లో బీటెక్ లేదా బీఎస్సీ(ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా జియోగ్రఫీ లేదా అగ్రికల్చర్) కలిగి ఉండాలి. అగ్రికల్చర్‌లో రిమోట్ సెన్సింగ్ మరియు GIS అప్లికేషన్‌లో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
⏩ డిప్యూటి కమీషనర్(NRM/RFS): 02 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి అగ్రోనమీ లేదా అగ్రికల్చర్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా అగ్రికల్చరల్ కెమిస్ట్రీ లేదా సాయిల్ సైన్స్ లేదా అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ లేదా అగ్రికల్చరల్ ఎకనామిక్స్ లేదా అగ్రికల్చరల్ బోటనీ లేదా ఫారెస్ట్రీ లేదా బోటనీలో మాస్టర్స్ డిగ్రీ లేదా అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.
⏩ డిప్యూటి డైరెక్టర్(మెడికల్): 01 పోస్టు
అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.
⏩ అసిస్టెంట్ కంట్రోలర్(మైన్స్): 02 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి మైనింగ్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ లేదా మైనింగ్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: జనరల్ 35 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ 45 సంవత్సరాలు మించకూడదు.
⏩ ట్రైనింగ్ ఆఫీసర్(వుమెన్ ట్రైనింగ్)– డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్‌లో ఇంటీరియర్ డిజైన్ అండ్ డెకరేషన్: 01 పోస్టు
అర్హత: ఇంటీరియర్ డిజైన్ మరియు డెకరేషన్‌లో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ లేదా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా ఆమోదించబడిన ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, సంబంధిత టీచింగ్ లేదా ఇండస్ట్రీలో రెండేళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: జనరల్ 35 సంవత్సరాలు మించకూడదు.
⏩ ట్రైనింగ్ ఆఫీసర్(వుమెన్ ట్రైనింగ్)– డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్‌లో ఆఫీస్ మేనేజ్‌మెంట్: 03 పోస్టులు
అర్హత: ఇంటీరియర్ డిజైన్ మరియు డెకరేషన్‌లో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ లేదా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా ఆమోదించబడిన ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, సంబంధిత టీచింగ్ లేదా ఇండస్ట్రీలో రెండేళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: జనరల్ 30 సంవత్సరాలు, ఎస్సీ 35 సంవత్సరాలు మించకూడదు.
⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్(కెమిస్ట్రీ): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(కెమిస్ట్రీ), పీహెచ్‌డీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: జనరల్ 35 సంవత్సరాలు మించకూడదు.
⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఇంగ్లీష్): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(ఇంగ్లీష్), పీహెచ్‌డీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఎస్టీ 35 సంవత్సరాలు మించకూడదు.
⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ (మ్యాథమెటిక్స్): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(మ్యాథమెటిక్స్), పీహెచ్‌డీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: జనరల్ 35 సంవత్సరాలు మించకూడదు.
⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్(ఫిజిక్స్): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(ఫిజిక్స్), పీహెచ్‌డీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఓబీసీ 38 సంవత్సరాలు మించకూడదు.
⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ (హిందీ): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(హిందీ), పీహెచ్‌డీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: జనరల్ 35 సంవత్సరాలు మించకూడదు.
⏩ సీనియర్ రిసెర్చ్ ఆఫీసర్: 02 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: జనరల్ 40 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.05.2024.