(Source: ECI/ABP News/ABP Majha)
UPSC IFS Result: ఐఎఫ్‌ఎస్ సర్వీస్ ఎగ్జామ్-2022 తుది ఫలితాలు విడుదల, బాపట్ల యువకుడికి ఫస్ట్ ర్యాంక్!
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) ఎగ్జామినేషన్-2022 తుది ఫలితాలను యూపీఎస్సీ జులై 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) ఎగ్జామినేషన్-2022 తుది ఫలితాలను యూపీఎస్సీ జులై 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మొత్తం 147 మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేసినట్లు యూపీఎస్సీ తెలిపింది. వీరిలో జనరల్-39, ఈడబ్ల్యూఎస్-21, ఓబీసీ-54, ఎస్సీ-22, ఎస్టీ-11 మంది అభ్యర్థులు ఉన్నారు.
కాగా బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ మొదటి ర్యాంకు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన సాహితిరెడ్డికి 48, తొగరు సూర్యతేజకు 66వ ర్యాంకు వచ్చింది ఐఎఫ్‌ఎస్ పరీక్షకు సంబంధించి రాత పరీక్షలను గతేడాది నవంబర్‌లో, ఇంటర్వ్యూలను ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే.
ALSO READ:
రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్‌లో 140 ఖాళీలు, అర్హతలివే!
చెన్నైలోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 'రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్' వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 140 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అడ్మిన్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జులై 19లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
'టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(ఎన్‌ఈఎస్‌టీఎస్) దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial