అన్వేషించండి

UPSC CDS Admit Card: సీడీఎస్ (1) - 2024 ఎగ్జామ్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?

UPSC CDSE Halltickets: కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (1)-2024 రాత పరీక్ష ఈ-అడ్మిట్‌ కార్డులను యూపీఎస్సీ ఏప్రిల్ 12న విడుదల చేసింది. ఏప్రిల్ 21న సీడీఎస్ఈ రాతపరీక్ష నిర్వహించనున్నారు. 

UPSC CDSE 2024 eAdmitcard: త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన 'కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ CDSE (1)-2024' రాత పరీక్ష ఈ-అడ్మిట్‌ కార్డులను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) ఏప్రిల్ 12న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. సీడీఎస్‌ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రూల్ నెంబర్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 21న సీడీఎస్ఈ రాతపరీక్ష నిర్వహించనున్నారు. 

కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (CDS) ఎగ్జామినేష‌న్(I)-2024 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) గతేడాది డిసెంబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని 457 ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి డిసెంబరు 20 నుంచి జనవరి 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఫర్‌ ఇంటెల్లిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.

Combined Defence Services Examination (I), 2024 - Admitcard

Press Note

వివరాలు...

➥ యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2024

మొత్తం ఖాళీలు: 457. 

విభాగాల వారీ ఖాళీలు..

⫸ ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), డెహ్రాడూన్: 100 పోస్టులు

⫸ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమల: 32 పోస్టులు

⫸ ఎయిర్ ఫోర్స్ అకాడమీ(ఏఎఫ్‌ఏ), హైదరాబాద్: 32 పోస్టులు

⫸ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మెన్): 275 పోస్టులు

⫸ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (ఉమెన్‌): 18 పోస్టులు

ఎంపిక విధానం: రెండు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్‌ ఇంటెల్లిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ (ఓటీఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్‌ పేపర్‌ రాయనవసరం లేదు.

ఇంటర్వ్యూ విధానం: ఇంటర్వ్యూ విభాగానికి 300 మార్కులు కేటాయించారు. కేవలం ఓటీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో రెండు దశలు ఉంటాయి. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్‌ ప్రాతిపదికన శిక్షణలోకి తీసుకుంటారు.

శిక్షణ వివరాలు: అభ్యర్థులు తమ ప్రాధాన్యం, మెరిట్‌ ప్రకారం ఆర్మీ, నేవీ, ఏయిర్‌ ఫోర్స్‌, ఓటీఏ వీటిలో ఏదో ఒక చోట అవకాశం పొందుతారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు ఇండియన్‌ మిలటరీ అకాడమీ దెహ్రాదూన్‌లో శిక్షణ ఉంటుంది. నేవల్‌ అకాడమీలో చేరినవాళ్లకు కేరళలోని ఎజిమాలలో శిక్షణ నిర్వహిస్తారు. ఏయిర్‌ ఫోర్స్‌ అకాడమీకి ఎంపికైనవారికి పైలట్‌ శిక్షణ హైదరాబాద్‌లో ఉంటుంది. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ పోస్టులకు ఎంపికైనవారు చెన్నైలో శిక్షణలో పాల్గొంటారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ఆర్మీ, ఓటీఏలో లెప్టినెంట్‌, నేవీలో సబ్‌ లెప్టినెంట్‌, ఏయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభమవుతుంది. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.

ముఖ్యమైన తేదీలు...

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.12.2023.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.01.2024.

* దరఖాస్తు సవరణ: 10.01.2024 నుంచి 16.01.2024 వరకు

* పరీక్ష తేదీ: 21.04.2024.

నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

యూపీఎస్సీ- ఎన్‌డీఏ, ఎన్‌ఏ(1)-2024 అడ్మిట్ కార్డులు విడుదల
ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహించే 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) & నేవల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ (I)- 2024 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏప్రిల్ 12న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రూల్ నెంబరు వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఈ ఏడాది ప్రథమార్దానికిగాను ఏప్రిల్ 21న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష అడ్మిట్‌కార్డు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget