UPSC Geo‐Scientist Results: కంబైన్డ్ జియో సైంటిస్ట్ తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 258 మంది ఎంపిక
UPSC: 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ -2023' తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) జనవరి 13న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.
UPSC CGS 2023 Final Results: 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ -2023' తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) జనవరి 13న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. మొత్తం 285 ఖాళీలకుగాను 258 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో జియోలజిస్ట్ పోస్టులకు 190 మంది, హైడ్రో జియోలజిస్ట్ పోస్టులకు 26 మంది, జియోఫిజిక్స్/జియోఫిజిసిస్ట్ పోస్టులకు 22 మంది, కెమిస్ట్/కెమికల్ పోస్టులకు 20 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 19 మంది అభ్యర్థుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచారు. వీరికి సంబంధించిన ఫలితాలను ఒరిజినల్ డాక్యుమెంట్ల పరిశీలన తర్వాత వెల్లడిస్తారు.
కంబైన్డ్ జియో సైంటిస్ట్ -2023 తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..
యూపీఎస్సీ(UPSC) తన భవన ప్రాంగణంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పరీక్షకు సంబంధించిన సమాచారం లేదా స్పష్టత కావాలనుకున్నవారు, అన్ని పని దినాల్లో ఉదయం 10 గం. సాయంత్రం 5 గం. మధ్య నేరుగాగానీ, టెలిఫోన్ నంబర్లు (011)- 23385271/23381125 ద్వారాగానీ సంప్రదించవచ్చు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో సైంటిస్ట్ -2023 స్టేజ్-1 (ప్రిలిమినరీ) పరీక్షను 2023, ఫిబ్రవరి 19న నిర్వహించింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 24, 25 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించింది. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నవంబరు, డిసెంబరు నెలల్లో పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించింది. ఇందులోనూ అర్హత సాధించినవారిని ఉద్యోగాలకు ఎంపికచేసింది.
వివరాలు..
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ - 2023
* మొత్తం పోస్టులు: 285
ఖాళీల వివరాలు..
కేటగిరీ-1: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-గనుల మంత్రిత్వ శాఖ - 256 పోస్టులు
1) జియాలజిస్ట్, గ్రూప్-ఎ: 216 పోస్టులు
2) జియోఫిజిసిస్ట్, గ్రూప్-ఎ: 21 పోస్టులు
3) కెమిస్ట్, గ్రూప్-ఎ: 19 పోస్టులు
కేటగిరీ-2: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్- జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ - 29 పోస్టులు
1) సైంటిస్ట్ బి (హైడ్రోజియాలజీ), గ్రూప్-ఎ: 26 పోస్టులు
2) సైంటిస్ట్ బి (కెమికల్), గ్రూప్-ఎ: 01 పోస్టు
3) సైంటిస్ట్ బి (జియోఫిజిక్స్) గ్రూప్-ఎ: 02 పోస్టులు
అర్హత: మాస్టర్ డిగ్రీ(జియోలాజికల్ సైన్స్/ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియో ఎక్స్‌ప్లోరేషన్/ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్/ ఇంజినీరింగ్ అప్లైడ్ జియోఫిజిక్స్/మెరైన్ జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్/ కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ/ అనలిటికల్ కెమిస్ట్రీ/ హైడ్రోజియాలజీ), ఎంఎస్సీ(టెక్)- అప్లైడ్ జియోఫిజిక్స్.
ALSO READ:
ఈసీఐఎల్ హైదరాబాద్‌లో 1,100 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు, వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. ఏడాది అప్రెంటిస్‌షిప్‌తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మొత్తం ఖాళీల్లో ఎస్సీ- 176, ఎస్టీ- 77, ఓబీసీ- 296, యూఆర్- 440, ఈడబ్ల్యూఎస్- 111 పోస్టులు కేటాయించారు. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..