అన్వేషించండి

CDSE -1 2023: యూపీఎస్సీ సీడీఎస్ఈ (I)-2023 తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I)-2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అక్టోబరు 27న విడుదల చేసింది. ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

UPSC CDSE 2023 Result: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I)-2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అక్టోబరు 27న విడుదల చేసింది. ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. త్రివిధ దళాల పరిధిలోని విభాగాల వారీగా ఫలితాలను విడుదల చేసింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.  త్వరలోనే అభ్యర్థుల మార్కులను వెల్లడించనున్నారు.

ఇండియన్‌ మిలటరీ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీలలో నియామకానికి సంబంధించి మొత్తం 235 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో ఇండియన్ మిలిటరీ అకాడమీకి 156 మంది, ఇండియన్ నేవల్ అకాడమీకి 57 మంది, ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి 22 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. తుది ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

UPSC CDS 1 Final result 2023: ఫలితాలు ఇలా చూసుకోండి...

1) ఫలితాల కోసం మొదటి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - upsc.gov.in

2) అక్కడ హోంపేజీలో “What’s New” లింక్ మీద క్లిక్ చేయాలి.

3) ఇప్పుడు “Final Result: Combined Defence Services Examination (I), 2023” ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.

4) సీడీఎస్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ఫలితాలు కంప్యూటర్ స్కీన్ మీద కనిపిస్తాయి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలు ఉంటాయి. 

5) 'Ctrl + F' క్లిక్ చేసి హాల్‌టికెట్ లేదా రూల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చేసుకోవచ్చు. నెంబర్ వస్తే అర్హత సాధించినట్లు లేకపోతే అర్హత లేనట్టే. 

6) ఫలితాలను డౌన్‌‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. 

సీడీఎస్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..

కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేష‌న్(I)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) డిసెంబరు 21న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి 2023, జనవరి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులు ఏప్రిల్ 10న రాతపరీక్ష నిర్వహించగా.. ఫలితాలను మే 4న విడుదల చేశారు. రాతపరీక్షలో మిలిటరీ అకాడమీకి 2696 మంది, నేవల్ అకాడమీకి 843 మంది, ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి  629 మంది అర్హత సాధించారు. వీరికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఫలితాలను తాాజాగా విడుదల చేసింది.

నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామ్ - 2023 తుది ఫలితాలు విడుదల, తర్వాతి దశకు 628 మంది అర్హత
ఎన్‌డీఏ & ఎన్ఏ (1)-2023 తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) అక్టోబరు 27న విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది. మొత్తం 628 మంది అభ్యర్థులు వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికయ్యారు.  దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 02-01-2024 నుంచి ప్రారంభమయ్యే 151వ కోర్సులో, 113వ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే ఉద్యోగాలు ఇస్తారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఐబీపీఎస్ పీవో మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఐబీపీఎస్ పీవో/ఎంటీ మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అక్టోబరు 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డు పొందవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 5న ఐబీపీఎస్ పీవో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష తేదీ వరకూ అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఐబీపీఎస్ మెయిన్స్  పరీక్ష నిర్వహించనున్నారు. 
పీవో అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Teachers Special TET: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget