News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

TSPSC Group-1 Results: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడో తెలుసా?

తెలంగాణ రాష్ట్ర తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని కుదిరితే ఈ వారాంతానికి పరీక్ష ఫలితాలు వెల్లడించే అవకాశముంది.

FOLLOW US: 
Share:

తెలంగాణ రాష్ట్ర తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని కుదిరితే ఈ వారాంతానికి పరీక్ష ఫలితాలు వెల్లడించే అవకాశముంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలతో పాటు 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షల షెడ్యూలు ప్రకటించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ చివరి వారంలో ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పన మొత్తం 25,150 మంది అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపిక చేయనున్నారు. 

మార్కు కేటాయింపు ఇలా..,
టీఎస్‌పీఎస్సీ నిబంధనల ప్రకారం తొలగించిన ప్రశ్నల మార్కులను మిగిలిన ప్రశ్నల జవాబులకు జతచేస్తారు. ఆ ప్రాతిపదికన 145 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 1.034 మార్కుల చొప్పున జతచేస్తే 149.93 వస్తున్నాయి. అంటే.. ఎన్ని సమాధానాలు సరైనవి రాస్తే ఒక్కోదానికి 1.034 మార్కుల చొప్పున ఇస్తారు. 

ఒకటికి రెండు సార్లు పరిశీలన...
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఓఎంఆర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. మూల్యాంకనం తరువాత ప్రిలిమినరీ ఫలితాల ప్రకటనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒకటికి రెండుసార్లు అన్ని వివరాలను సరిచూస్తోంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 1:50 నిష్పత్తిలో ప్రకటించనుంది. అంటే ప్రధాన పరీక్షకు మొత్తం 25,150 మందిని ఎంపిక చేయనుంది. ఈ మేరకు మల్టీజోన్లు, రిజర్వుడు వర్గాల వారీగా జాబితాలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఫలితాలు ఈ వారంలోనే ఇవ్వాలని భావిస్తోంది. టీఎస్‌పీఎస్సీ ముందస్తు ప్రణాళిక ప్రకారం శుక్ర లేదా శనివారం వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఏవైనా సాంకేతిక ఇబ్బందులతో ఆలస్యమైతే సోమవారానికి ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తిచేయనుంది.

తెలంగాణ 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్‌ కీని టీఎస్‌పీఎస్సీ నవంబరు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు టీఎస్‌పీఎస్సీ ఫైనల్‌ కీని విడుదల చేసింది. ఒక్కో ప్రశ్నకు 1.034 మార్కులు ఇవ్వనున్నట్టు చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. సబ్జెక్టు నిపుణుల కమిటీతో చర్చించిన తర్వాత 5 ప్రశ్నలను తొలగించినట్టు పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ నిబంధనల ప్రకారం తొలగించిన ప్రశ్నల మార్కులను మిగిలిన ప్రశ్నల జవాబులకు జతచేస్తారు. ఆ ప్రాతిపదికన 145 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 1.034 మార్కుల చొప్పున జతచేస్తే 149.93 వస్తున్నాయి. అంటే.. ఎన్ని సమాధానాలు సరైనవి రాస్తే ఒక్కోదానికి 1.034 మార్కుల చొప్పున ఇస్తారు. 

తెలంగాణ రాష్ట్ర తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని అక్టోబరు 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షలో వివిధ సిరీస్‌లలో ప్రశ్నలతో పాటు సమాధానాలను కూడా జంబ్లింగ్ చేసి బహుళ సిరీస్‌ల్లో ప్రశ్నపత్రాలను రూపొందించారు. వాటన్నింటికీ మాస్టర్‌గా ఉన్న ప్రశ్నపత్రాన్ని, దాని ప్రాథమిక ఆన్సర్ కీని అధికారులు విడుదల చేశారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపేందుకు 5 రోజులపాటు అవకాశం కల్పించారు. 

రాష్ట్రంలో 503 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి టీఎస్‌పీస్సీ అక్టోబరు 16న ప్రిలి‌మి‌న‌రీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,86,051 మంది పరీ‌క్షకు హాజ‌ర‌య్యారు. ఈ పరీ‌క్షలో టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ తొలి‌సారి ఒక్కో అభ్యర్థికి ఒక్కో నంబర్‌ సిరీ‌స్‌తో ప్రశ్నా‌పత్రం ఇచ్చింది. ప్రశ్నలు అవే ఉన్నప్పటికీ జంబ్లింగ్‌ పద్ధతిలో జవా‌బులు అడి‌గారు. ప్రతి‌ఒ‌క్కరికీ ఒక్కో ‘కీ’ ఇవ్వడం సాధ్యం కానం‌దున మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్‌ ప్రిలిమినరీ ‘కీ’ని అక్టోబరు 29న, ఫైనల్ కీని నవంబరు 15న విడుదల చేసింది. 

Also Read:

'గ్రూప్-4' నోటిఫికేషన్ వచ్చేసింది - అర్హతలు, దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 2న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు 2023, జనవరి 30 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ విడుదల, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 30న గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభంకానుంది. పోస్టుల అర్హతలు, ఇతర వివరాలను జనవరి 24 నుంచే పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! 
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా శుభవార్త తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 04 Jan 2023 11:57 PM (IST) Tags: TSPSC Group 1 Result Group 1 Prelims Result Group 1 Marks Group 1 Result TSPSC Group-1 Prelims Result

ఇవి కూడా చూడండి

IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు

IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు

TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?

TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?

ISRO Exam: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

ISRO Exam: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ 'గ్రూప్‌-2' సిలబస్‌లో కీలక మార్పులు, అవేంటంటే?

APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ 'గ్రూప్‌-2' సిలబస్‌లో కీలక మార్పులు, అవేంటంటే?

టాప్ స్టోరీస్

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
×