News
News
X

TSPSC: గ్రూప్-2,3,4 నోటిఫికేషన్లు వచ్చేది ఎపుడంటే?

ఉద్యోగాల భర్తీని వేగవంతం చేసిన టీఎస్పీఎస్సీ అధికారులు. సోమవారం నుంచి వరుసగా మూడు, నాలుగు రోజల పాటు వివిధ శాఖాధిపతులతో సమావేశాలు నిర్వహిస్తారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో ఉద్యోగాల భర్తీని వేగవంతం చేసిన టీఎస్పీఎస్సీ అధికారులు. ఇటీవల గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు పూర్తి కాగా, సోమవారం గ్రూప్‌-4కి సంబంధించి సుమారు 30 శాఖల అధికారులతో టీఎస్పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్‌ సమావేశం కానున్నారు. మూడు, నాలుగు రోజల పాటు వరుసగా వివిధ శాఖాధిపతులతో సమావేశాలు నిర్వహిస్తారు. 94 శాఖల అధికారులతో దశల వారీగా సమావేశాలు నిర్వహించి, గ్రూప్‌-2, 3, 4కి సంబంధించిన ఖాళీలు, ఇండెంట్లు, రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లు తదితర అంశాల గురించి చర్చిస్తారు. నూతన జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో దానికి అనుగుణంగా ప్రస్తుత సర్వీసు రూల్స్‌ తదితర అంశాలపై చర్చిస్తారు.

ఆయా శాఖల్లో ఖాళీలు తదితర విషయాలతో కూడిన సమగ్ర సమాచారంతో కూడిన నివేదికను అధికారులు టీఎస్‌పీఎస్‌సీకి సమర్పిస్తారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్‌లో గ్రూప్‌-2, 3, 4 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేయనున్న టీఎస్పీఎస్సీ. రాబోవు నోటిఫికేషన్లలో గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 కేటగిరీల్లో మరిన్ని పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను జనరల్ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సవరించింది. ఇందుకు సంబంధించి నవంబరు 24న ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రూప్-2లో 6, గ్రూప్-3లో 2, గ్రూప్-4లో 4 రకాల పోస్టులు ఉన్నాయి. కాగా గ్రూప్-2లో 663, గ్రూప్ -3లో 1373, గ్రూప్- 4లో 9168 ఖాళీలు ఉన్నాయి.

ఉద్యోగ నియామక ప్రక్రియలో టీఎస్‌పీఎస్‌సీ ప్రణాళికతో ముందుకెళుతున్నది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా అడుగులు వేస్తున్నది. కొత్తజోనల్‌ వ్యవస్థ ప్రకారం 95శాతం స్థానిక కోటా, రిజర్వేషన్లు తదితరాలు అన్నింటినీ ఒకటికి రెండుసార్లు నిశితంగా పరిశీలిస్తున్నది. జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ స్థాయిలో అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో ఆయా శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మరోసారి సరిచూసుకుని, రీచెక్‌ చేసిన తర్వాతే నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరిలోనే వీలైనన్ని పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నది.

గ్రూప్-2లో చేర్చిన పోస్టులు ఇవీ..

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిష్‌ సర్వీస్‌)
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర శాఖలకు సంబంధించి)
➥ జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్

గ్రూప్-3లో చేర్చిన పోస్టులు ఇవీ..

➥ గిరిజ సంక్షేమ శాఖ అకౌంటెంట్
➥ సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ లేదా హెచ్‌ఓడీల్లో ఇదే విధమైన పోస్టులు

గ్రూప్-4లో చేర్చిన పోస్టులు ఇవీ..

గ్రూప్-4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి. 
➥జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్
➥ జువైనల్ సర్వీసెస్ సూపర్‌వైజర్ (మేల్) (జువైనల్ సర్వీసెస్, డబ్య్లూసీడీ అండ్ ఎస్సీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్)
➥ మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్
➥ మ్యాట్రన్ (కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్)

1) జూనియర్ అకౌంటెంట్: 429 పోస్టులు

🔰 విభాగాలవారీగా ఖాళీలు: ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238

2) జూనియర్ అసిస్టెంట్: 6,859 పోస్టులు

🔰 విభాగాలవారీగా ఖాళీలు:

వ్యవసాయశాఖ-44 బీసీ సంక్షేమశాఖ-307 పౌరసరఫరాల శాఖ-72 అటవీశాఖ-23
వైద్యారోగ్యశాఖ-338 ఉన్నత విద్యాశాఖ-742 హోంశాఖ-133 నీటిపారుదల శాఖ-51
మైనార్టీ సంక్షేమశాఖ-191 పురపాలక శాఖ-601 పంచాయతీరాజ్-1,245 రెవెన్యూశాఖ-2,077
సెకండరీ విద్యాశాఖ-97 రవాణాశాఖ-20 గిరిజన సంక్షేమ శాఖ-221 మహిళా, శిశు సంక్షేమం-18
ఆర్థికశాఖ-46 కార్మికశాఖ-128 ఎస్సీ అభివృద్ధి శాఖ-474 యువజన సర్వీసులు-13

3) జూనియర్ ఆడిటర్: 18 పోస్టులు

🔰 విభాగం: డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్

4) వార్డ్ ఆఫీసర్: 1862 పోస్టులు

🔰 విభాగం: కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.

ప్రభుత్వం 80039 ఉద్యోగాల భర్తీకి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 52వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులను దశలవారీగా జారీ చేసింది. 18వేల కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలతోపాటు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే పూర్తయింది. మిగతా పోస్టుల భర్తీకి వీలుగా అన్ని సంబంధిత విభాగాలు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాయి.

అయితే రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల ప్రకటనతో భర్తీ ప్రక్రియకు కొంత ఆటంకం ఎదురైంది. ఉద్యోగ ఖాళీల ప్రతిపాదనల్లో జనాభా ఆధారంగా గిరిజనులకు రిజర్వేషన్ల ఫలాలను ప్రభుత్వం అందించేందుకు 6నుంచి 10శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. 10శాతం రిజర్వేషన్లతో 100 రోస్టర్‌ పాయింట్లలో 10పాయింట్లను రిజర్వ్‌ చేస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిపాదనలకు సవరణలు పూర్తయ్యాయి.

ఒక్కో జిల్లాలో 74 విభాగాలలో కసరత్తు పూర్తికి చేరడంతో ఇక వరుసగా నోటిఫికేషన్లకు అడ్డంకులు తొలిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలలో 9వేల ఉద్యోగాలకు, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులపై ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. త్వరలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 28 Nov 2022 03:00 PM (IST) Tags: TSPSC Exams TSPSC Notifications TSPSC Group 3 Group 2 Posts Group-4 Posts TS Group Exams Group 4 Posts

సంబంధిత కథనాలు

TSPSC: గ్రూప్-4 ఉద్యోగార్థులకు అలర్ట్, పరీక్ష తేదీ ప్రటించిన టీఎస్‌పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?

TSPSC: గ్రూప్-4 ఉద్యోగార్థులకు అలర్ట్, పరీక్ష తేదీ ప్రటించిన టీఎస్‌పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?

SECL Recruitment: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 405 ఉద్యోగాలు, అర్హతలివే! జీతమెంతో తెలుసా?

SECL Recruitment: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 405 ఉద్యోగాలు, అర్హతలివే! జీతమెంతో తెలుసా?

TSPSC HWO Recuitment: 581 ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే అప్లయ్ చేసుకోండి!

TSPSC HWO Recuitment: 581 ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే అప్లయ్ చేసుకోండి!

UPSC IFS Notification: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పోస్టులెన్నంటే?

UPSC IFS Notification: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పోస్టులెన్నంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!

Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!

Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్

Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam

PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam