TSPSC AEE Exam: ఏఈఈ రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది.
తెలంగాణలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 21, 22 తేదీల్లో సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. మే 17 నుంచి పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం వెబ్‌సైట్‌లో పరీక్షలకు సంబంధించి మాక్‌లింక్ అందుబాటుల ఉంది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 8న ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్; మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక మే 21, 22 తేదీల్లో రెండు షిప్టుల్లో ఏఈఈ(సివిల్) పోస్టులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. తుది స్కోరు ఖరారులో నార్మలైజేషన్ పద్ధతిని పాటించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది.
ఈ ఏడాది జనవరి 22న నిర్వహించిన ఏఈఈ పరీక్షను పేపర్ లీకేజీ కారణంగా కమిషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. 1,540 పోస్టుల భర్తీకి ఏఈఈ నోటిఫికేషన్‌ను 2022 సెప్టెంబర్ 3న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన విషయం విదితమే. ఈ పోస్టులకు 44,352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
రాతపరీక్ష విధానం:
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు, పేపర్-2(అభ్యర్థి సబ్జెక్టు)కు 300 మార్కులు కేటాయించారు. పేపర్-1లో 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో 150 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలుగా కేటాయించారు.
ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులను భర్తీకి సెప్టెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భర్తీ చేయనున్నారు.
ఏఈఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. వాస్తవానికి అక్టోబరు 15 దరఖాస్తుకు చివరితేది కాగా.. గడువు పొడిగించాలంటూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో మరో 5 రోజులు అవకాశం కల్పిస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది.
పోస్టుల వివరాలు..
* అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 1540
1) ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ (మిషన్ భగీరథ): 302 పోస్టులు
2) ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్: 211 పోస్టులు
3) ఏఈఈ (సివిల్) ఎంఏ యూడీ- పీహెచ్: 147 పోస్టులు
4) ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్: 15 పోస్టులు
5) ఏఈఈ ఐసీఏడీ డిపార్ట్ మెంట్: 704 పోస్టులు
6) ఏఈఈ (మెకానికల్) ఐసీఏడీ(జీడబ్ల్యూడీ): 03 పోస్టులు
7) ఏఈఈ (సివిల్) టీఆర్‌బీ: 145 పోస్టులు
8) ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్‌బీ: 13 పోస్టులు
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-09-2022.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2022. (20.10.2022 వరకు పొడిగించారు)
➥ పరీక్ష తేదీ: 22.01.2023. (08.05.2023 నుంచి)
పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..