అన్వేషించండి

Group1 Key: నేటి నుంచి ‘గ్రూప్-1’ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ, చివరితేది ఎప్పుడంటే?

ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపేందుకు 5 రోజులపాటు అవకాశం కల్పించారు. అభ్యర్థులు అక్టోబరు 31 నుంచి నవంబరు 4 వరకు ఆన్సర్ కీపై తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు.

తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ అక్టోబరు 29న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షలో వివిధ సిరీస్‌లలో ప్రశ్నలతో పాటు సమాధానాలను కూడా జంబ్లింగ్ చేసి బహుళ సిరీస్‌ల్లో ప్రశ్నపత్రాలను రూపొందించారు. వాటన్నింటికీ మాస్టర్‌గా ఉన్న ప్రశ్నపత్రాన్ని, దాని ప్రాథమిక ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపేందుకు 5 రోజులపాటు అవకాశం కల్పించారు. అభ్యర్థులు అక్టోబరు 31 నుంచి నవంబరు 4 వరకు ఆన్సర్ కీపై తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించి తుది కీ, ఆ తర్వాత ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేయనుంది. ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్ష కోసం ఎంపిక చేయనున్నారు. 

Also Read:  'గ్రూప్-1' ప్రిలిమినరీ కీ వచ్చేసింది, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో! అభ్యంతరాలకు అవకాశం!!


ప్రత్యేక లింక్ ద్వారానే అభ్యంతరాలు...

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన వెబ్‌లింక్ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే అభ్యర్ధులు అభ్యంతరాలను నమోదు చేయవల్సి ఉంటుంది. ఈమెయిల్స్ లేదా ఇతర రాతపూర్వక మార్గాల్లో అభ్యంతరాలను సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోమని కమిషన్‌ స్పష్టం చేసింది. అభ్యర్థులు అభ్యంతరాలతో పాటు సరైన సమాధానానికి సంబంధించిన రుజువులు లేదా రిసోర్సు కాపీలను పీడీఎఫ్‌ రూపంలో సమర్పించాలని పేర్కొంది. ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాకుంటే రెండు, మూడు రోజుల్లో ఫైనల్‌ కీ ని ప్రకటించనుంది. ఫైనల్ కీతోపాటు ఫలితాలను కూడా టీఎస్‌పీఎస్సీ విడుదల చేయనుంది.

వెబ్‌సైట్

తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు గాను.. 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,86,051 అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

కటాఫ్ మార్కులు లేవు..

తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్ మార్కులపై సామాజిక మాధ్యమాల్లో వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారంపై టీఎస్‌పీఎస్సీ అధికారులు అక్టోబరు 17న స్పష్టత ఇచ్చారు. 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష కేవలం  స్క్రీనింగ్ పరీక్ష మాత్రమేనని, ఇందులో ఎలాంటి కనీస అర్హత మార్కులు ఉండవని ప్రకటించింది. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక విధానంలో మార్పులు జరిగాయని వివరించింది. గతంలో మార్కుల ప్రాతిపదికన ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసే విధానం ఉండేదని పేర్కొంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. మల్టీ జోన్ వారీగా రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.


Also Read:
 

'గ్రూప్-1'తో మొదలు! ఇక టీఎస్‌పీస్సీ పరీక్షలు'ఈజీ' కాదు!
తెలంగాణ తొలి 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు సివిల్స్‌ తరహాలో కఠినంగా ఉన్నట్లు పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు కఠినంగా వచ్చాయని, విశ్లేషణాత్మక, స్టేట్‌మెంట్‌ ఆధారిత, సుదీర్ఘ విశ్లేషణలతో కూడినవి ఎక్కువగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. వాటిని చదివి, అర్థం చేసుకుని సమాధానాలు గుర్తించేందుకు సమయం సరిపోలేదని అన్నారు. ప్రిలిమ్స్‌ ప్రశ్నల కాఠిన్యత, అడిగిన తీరు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష స్థాయికి మించి ఉందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. 
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ సంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget