By: ABP Desam | Updated at : 22 Jan 2023 06:14 AM (IST)
Edited By: omeprakash
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరీక్ష
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి జనవరి 22న రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఏడు జిల్లాల్లోని 176 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. OMR విధానంలోనే పరీక్ష జరుగనుంది. 22న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్- 2 పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్షకు ఉదయం 8.30 నుంచి 9.45 వరకు, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. గేట్లు మూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో; పేపర్-2 ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. ఇప్పటికే హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
TSPSC AEE పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష వివరాలు...
➥ పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్): ఉదయం 10 గం. నుంచి 12.30 గం. వరకు.
➥ పేపర్-2 (అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టు): ఉదయం 10 గం. నుంచి 12.30 గం. వరకు.
➥ పరీక్ష కేంద్రాలు: కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి.
రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు, పేపర్-2(అభ్యర్థి సబ్జెక్టు)కు 300 మార్కులు కేటాయించారు. పేపర్-1లో 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో 150 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలుగా కేటాయించారు.
పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
అభ్యర్థులకు సూచనలు..
➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. ఎందుకంటే పరీక్ష కేంద్రంలోకి వచ్చేందుకు పేపర్-1కు ఉదయం 8.30 నుంచి 9.45 వరకు, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 వరకే అనుమతించనున్నారు. అంటే పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగానే అభ్యర్థులు పరీక్ష హాల్‌లో ఉంటారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.
➥ పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లకు అనుమతిలేదు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు తీసుకొస్తే వారిని డిబార్ చేస్తారు.
➥ అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఇచ్చిన పరీక్ష నిబంధనల గురించి క్షుణ్నంగా చదవాలి. వాటిని పాటించాల్సిందే.
➥ పరీక్ష కేంద్రాన్ని చివరిక్షణంలో వెత్తుక్కోవడం కన్నా.. ముందుగానే పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో చూసుకోవడం ఉత్తమం.
➥ హాల్‌టికెట్ మీద ఫోలో స్పష్టంగా లేనివారు, ఫోటో చిన్నగా ఉన్నవారు, ఫోట్ లేనివారు, సంతకం లేనివారు పరీక్షకు వచ్చేప్పుడు 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను వెంటతీసుకెళ్లాలి. గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్‌తోపాటు అండర్‌టేకింగ్ తీసుకోవాలి. దాన్ని పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు సమర్పించాలి. అలాకాని పక్షంలో పరీక్షకు అనుమతించరు.
Also Read: మున్సిపల్' ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?
పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
Anganwadi Recruitment 2023: విజయనగరం జిల్లాలో 60 అంగన్వాడి పోస్టులు, వివరాలు ఇలా!
PWC India: గుడ్‌న్యూస్ చెప్పిన PWC - 30వేల ఉద్యోగాలు ఇస్తారట!
LIC ADO Recruitment: 9394 ఉద్యోగాల దరఖాస్తుకు కొద్దిరోజులే గడువు, వెంటనే అప్లయ్ చేయండి! మారిన పరీక్ష తేదీ!
AP SI Hall Tickets: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?
DMHO Recruitment: కృష్ణా జిల్లా, డీఎంహెచ్‌వోలో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్