TS Ration Dealer: తెలంగాణలో రేషన్ డీలర్ ఉద్యోగాలు, పదోతరగతి పాసైన వారికి అవకాశం! వీరు మాత్రమే అర్హులు!
పదోతరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత డివిజన్‌లో స్థానికుడై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ డీలర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 27 రేషన్ డీలర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత డివిజన్‌లో స్థానికుడై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వివరాలు..
* రేషన్ డీలర్: 27 ఖాళీలు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానికత ఉండాలి. ఆపై విద్యార్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానికేతరులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. అభ్యర్థులు పుట్టినతేది, విద్యార్హతలు, కులం, పూర్తి చిరునామా, స్థానికతకు సంబంధించిన సర్టిఫికేట్ పత్రాలను దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి ఉంటుంది.
వయోపరిమితి: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంలో రూ.1000 చెల్లించి దరఖాస్తులు పొందాలి. దరఖాస్తులు పూరించి అదే కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులపై ఎలాంటి క్రిమినల్/సివిల్ కేసులు ఉండకూడు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది. ఇందులో రాతపరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు. రాతపరీక్ష అర్హత మార్కులను 32గా నిర్ణయించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ముఖ్యమైన తేదీలు...
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.12.2022.
➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 06.01.2023.
➥ రాత పరీక్ష తేది: 22.01.2023.
➥ ఇంటర్వ్యూ తేది: 27.01.2023.
పరీక్ష కేంద్రం: గవర్నమెంట్ మెన్స్ డిగ్రీ కాలేజీ, ఆదిలాబాద్.
Also Read:
కానిస్టేబుల్ పోస్టుల 'అప్లికేషన్ స్టేటస్' వచ్చేసింది! చెక్ చేసుకోండి, డైరెక్ట్ లింక్ ఇదే!
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ పోస్టులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయ్ పోస్టుల భర్తీకి సంబంధించిన 'అప్లికేషన్ స్టేటస్' లింక్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యాక్టివేట్ చేసింది. అయితే ప్రస్తుతానికి సౌత్ రీజియన్, కర్ణాటక-కేరళ రీజియన్లకు సంబంధించిన లింక్‌ను మాత్రమే అందుబాటులో ఉంచింది. త్వరలోనే రీజియన్ల వారీగా అన్ని రీజినల్ వెబ్‌సైట్లలో పెట్టనుంది. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ స్టేటస్ వివరాలు తెలుసుకోవడానికి క్లిక్ చేయండి..
ఎఫ్‌సీఐలో 5043 ఉద్యోగాల భర్తీ, పరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ గ్రేడ్-3 పరీక్ష అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు (పాన్‌కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్..) వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్‌కార్డులో అభ్యర్థుల వివరాల్లో ఏమైనా సందేహాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలి.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి.