అన్వేషించండి

TSPSC: 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్? కొత్తవాళ్లకే అవకాశం!

TSPSC Group1 Recruitment: తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. రాష్ట్రంలో గ్రూప్-1 కేటగిరీ ఖాళీల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

TSPSC Group1 Recruitment: తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. రాష్ట్రంలో గ్రూప్-1 కేటగిరీ ఖాళీల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్​పీఎస్సీ చర్యలు మొదలుపెట్టింది. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి, వాటి భర్తీకి ఏర్పాట్లు చేయాలని టీఎస్​పీఎస్సీ భావిస్తోంది. ఇప్పటికే గ్రూప్-1 పోస్టుల ఖాళీల వివరాలను ఆర్థికశాఖ కోరగా.. అన్ని డిపార్ట్ మెంట్లలో కేవలం 43 మాత్రమే ఖాళీగా ఉన్నాయని అధికారులు తేల్చారు. మరో 23 పోస్టుల భర్తీపై వివాదాలుండటంతో, ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఆర్థికశాఖ భావిస్తోంది. దీనికితోడు రానున్న ఆరు నెలల్లో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలనూ సేకరించాలని యోచిస్తున్నారు. కనీసం వంద పోస్టులనైనా కలపాలనే భావనలో ఉన్నారు. 

గ్రూప్-1 ఖాళీలకు ఆర్థికశాఖ నుంచి అనుమతి రాగానే.. సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని టీఎస్‌పీఎస్సీ ఆలోచనగా ఉంది. ప్రస్తుతం కొత్త కమిషన్ సమావేశం నిర్వహించి, ఈ నిర్ణయాలు తీసుకోవాలని యోచిస్తున్నారు. అయితే, ప్రభుత్వం చైర్మన్‌తో పాటు ఐదుగురు సభ్యులను నియమించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఇద్దరు సభ్యులు ఇంకా విధుల్లో చేరలేదు. మరో సభ్యురాలు సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కమిషన్ సమావేశం ఆలస్యమవుతుందని తెలుస్తోంది. మరో వారంలో సమావేశం నిర్వహించి, దాంట్లో కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

కొత్త పోస్టులు కొత్తవాళ్లకే అవకాశం..
గతేడాది 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు మరిన్ని పోస్టులు కలిపితే మొత్తం ఖాళీల సంఖ్య 600 వరకూ ఉండే అవకాశం ఉంది. అదనపు పోస్టులకు సంబంధించి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్​పీఎస్పీ యోచిస్తోంది. ఈ క్రమంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గతంలో దరఖాస్తు చేసిన వారితో పాటు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అయితే, కొత్తగా దరఖాస్తు చేసేవారు మాత్రం కొత్త పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గ్రూప్-2కు ఇలాగే చేసినట్లు టీఎస్​పీఎస్సీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఈ నిబంధనను మార్చాలనుకుంటే సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి!
తెలంగాణ ఏర్పడిన తర్వాత  తొలిసారిగా గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్‌ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ ఈ ఏడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను కూడా కోర్టు రద్దు చేసింది. అయితే ఈ తీర్పుపై టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం దీనిపై కేవియెట్ పిటిషన్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ముందుకు పోతే, తీర్పు రావడం ఆలస్యమైతే ఎలా అనే ఆందోళన కమిషన్ లో నెలకొన్నది. ఈ నేపథ్యంలో కేసును విత్ డ్రా చేసుకొని, మళ్లీ పరీక్ష పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget