TSPSC: అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల ఎంపిక ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?
తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విభాగంలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఎంపిక ఫలితాలను టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్ 6న విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను అందుబాటులో ఉంచింది.
TSPSC AO Result: తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విభాగంలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఎంపిక ఫలితాలను టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్ 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వారివారి హాల్‌టికెట్ నెంబర్ల ఆధారంగా ఫలితాలు చూసుకోవచ్చు. ఫిబ్రవరి 17న అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాల (జీఆర్‌ఎల్)ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించింది. అయితే దివ్యాంగులను 1:5 నిష్పత్తిలో ఎంపికచేసింది.
అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంపిక ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 18, 19వ తేదీల్లో నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు అన్నిరకాల సర్టిఫికేట్లు, డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. అంతేకాకుండా అభ్యర్థులు ఏప్రిల్ 16 నుంచి 19 మధ్య వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విభాగంలో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022, డిసెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అగ్రికల్చర్ బీఎస్సీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టుల భర్తీకి 2023, జనవరి 10 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే 16న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించారు. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని మే 17న కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి జూన్ 1 నుంచి 3 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. తర్వాత 2024 ఫిబ్రవరి 6న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. ఫిబ్రవరి 17న అభ్యర్థులు ర్యాంకులను ప్రకటించింది. తాజాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించే వేదిక: O/o Telangana State Public Service Commission, Nampally, Hyderabad
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఇవి అవసరం..
1) వెబ్‌సైట్‌లో సూచించిన ప్రకారం చెక్ లిస్ట్ (1 సెట్) ఉండాలి.
2) దరఖాస్తు సమయంలో సమర్పించి అప్లికేషన్ ఫామ్ (పీడీఎఫ్) ప్రింట్ కాపీ
3) పరీక్ష హాల్‌టికెట్
4) పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో.
5) 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు లేదా ప్రైవేట్/ఓపెన్ స్కూల్‌లో చదివిన అభ్యర్థులైతే రెసిడెన్స్/స్థానికత సర్టిఫికేట్ ఉండాలి.
6) డిగ్రీ లేదా పీజీ ప్రొవిజినల్/ కాన్వొకేషన్ సర్టిఫికేట్, మార్కుల మెమో.
7) ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ (అందులో తల్లిదండ్రుత పేర్లు తప్పనిసరిగా ఉండాలి).
8) బీసీ వర్గానికి చెందినవారైతే నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇతర బీసీ సర్టిఫికేట్లు అంగీకరించరు.
9) రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులగుతై వయోపరిమితి సడలింపు కోసం సర్వీస్ సర్టిఫికేట్/NCC ఇన్‌స్ట్రక్టర్/ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్/ సెన్సస్ సర్వీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
10) పీహెచ్ సర్టిఫికేట్ (SADERAM సర్టిఫికేట్).
11) ఇన్-సర్వీస్ అభ్యర్థులైతే NOC తప్పనిసరి.
12) గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు సెట్ల అటెస్టేషన్ సర్టిఫికేట్ కాపీలు ఉండాలి.
13) నోటిఫికేషన్ సమయంలో పేర్కొన్న అన్ని ఇతర సర్టిఫికేట్లు తీసుకురావాలి.