అన్వేషించండి

TGPSC Lab Technician Recruitment: ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 285 మంది ఎంపిక

TSPSC: తెలంగాణ వైద్యశాకలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఫలితాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మొత్తం 285 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

TVVP Lab Technician Results: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ల్యాబ్ టెక్నీషియన్(తెలంగాణ వైద్య విధాన పరిషత్) ఎంపిక ఫలితాలను టీజీపీఎస్సీ జులై 8న విడుదల చేసింది. జిల్లాలవారీగా వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోని విభాగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను హాల్‌టికెట్ నెంబర్లతో సహా అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 285 మంది అభ్యర్థులు ప్రాథమికంగా ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే సరైన అర్హతలు లేని కారణంగా 16 పోస్టులను ఖాళీగా ఉంచారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ రిమ్స్‌లో 19 పోస్టులను, నల్గొండ జిల్లాలో ఎస్సీ కేటగిరీ కింద 1 పోస్టు, ఖమ్మం జిల్లాల్లో ఎస్టీ కేటగిరీ కింద 1 పోస్టు, వరంగల్ జిల్లాల్లో ఎస్టీ కేటగిరీ కింద 1 పోస్టు, హైదరాబాద్ జిల్లాల్లో  1 పోస్టు భర్తీకాలేదు. 

TGPSC ల్యాబ్ టెక్నీషియన్ మెరిట్ జాబితా ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. 

➥ ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- https://websitenew.tspsc.gov.in 

➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Lab Technician GR –II' మెరిట్ జాబితా లింక్ మీద క్లిక్ చేయాలి. 

➥ ల్యాబ్ టెక్నీషియన్ మెరిట్ జాబితాకు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది 

➥ అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు ఆధారంగా, జిల్లాలవారీగా ఎంపిక జాబితా చూసుకోవచ్చు. 

➥ ఫలితాలకు సంబంధించిన ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

➥ భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.

ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Notification

TGPSC Lab Technician Recruitment: ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 285 మంది ఎంపిక

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి 2028, మే 11న టీజీపీఎస్సీ రాతపరీక్ష నిర్వహించింది. సర్వీస్ వెయిటేజీ మార్కులు, అర్హత వెయిటేజీ ప్రకారం గతేడాది ఆగస్టు 3 నుంచి 11 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించింది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి 3న రెండో విడత; ఏప్రిల్ 15, 16 , 25 తేదీల్లో మూడో విడతలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టింది. తాజాగా అభ్యర్థుల ప్రాథమిక ఎంపిక జాబితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనలో సమర్పించిన డాక్యుమెంట్ల వివరాల్లో ఏమైనా తప్పులున్నట్లు తేలితే ఎంపిక జాబితా నుంచి వారిని తొలగిస్తారు. మొత్తం ఖాళీల్లో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (DPH&FW)లో 103 పోస్టులు; వైద్యవిద్య విభాగం (DME)లో 88 పోస్టులు, తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ (TVVP)లో 9 పోస్టులు ఉన్నాయి. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైనవారికి రూ.21,230 - రూ.63,010; వైద్యవిద్య విభాగంలో టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైనవారికి రూ.21,230 - రూ.63,010; వైద్యవిధాన పరిషత్‌లో టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైనవారికి రూ.23,100 - రూ.67,990  జీతంగా చెల్లిస్తారు.

తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, వైద్యవిద్య విభాగం, వైద్యవిధాన పరిషత్‌లో 200 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి 2017, డిసెంబరు 18న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఖాళీల్లో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (DPH&FW)లో 103 పోస్టులు; వైద్యవిద్య విభాగం (DME)లో 88 పోస్టులు, తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ (TVVP)లో 9 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల ద్వారా డిసెంబరు 23 నుంచి 2018, జనవరి 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2018, మే 11న టీజీపీఎస్సీ రాతపరీక్ష నిర్వహించింది. రాతపరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మూడు విడతల్లో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టింది. తాజాగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.

ALSO READ: టీజీపీఎస్సీ 'జేఎల్' పరీక్ష ఫలితాలు విడుదల, సబ్జెక్టులవారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు ఇలా

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget