Telangana Police Jobs: పోలీస్ జాబ్‌కి ట్రై చేస్తున్న అభ్యర్థులకు కీలక సూచనలు, పాటించకపోతే Free ట్రైనింగ్ మిస్సయినట్టే
Police Jobs In Telangana: పోలీస్ కావడానికి ట్రైనింగ్ తీసుకొనే స్థోమత లేని వారి కోసం ఉచిత శిక్షణ ఇచ్చేందుకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులకు సూచనలు చేశారు.
Telangana Police Jobs 2022: తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగం సాధించాలనుకునే పేద విద్యార్థులు, అభ్యర్థులకు రాచకొండ పోలీసులు అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నారు. పోలీస్ కావడానికి ట్రైనింగ్ తీసుకొనే స్థోమత లేని వారి కోసం ఉచిత శిక్షణ ఇచ్చేందుకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 5న పరీక్ష నిర్వహించనున్నారు. ఇదివరకే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన పోలీసులు అందుకు తగ్గట్లుగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు (మంగళవారం) మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య పరీక్ష నిర్వహించనున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ పరీక్షకు హాజరు అయ్యే విద్యార్థులకు పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ఆ వివరాలు మీకోసం.
1) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ సొంత ఎగ్జామ్ ప్యాడ్ తెచ్చుకోవాలి. ఎగ్జామ్ ప్యాడ్ తెచ్చుకోని వారిని పరీక్షకు హాజరు కానిచ్చేది లేదని స్పష్టం చేశారు.
2) ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకురావాలి
3) అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ పెన్ వెంట తెచ్చుకోవాలి
4) కొవిడ్19 నిబంధనల కారణంగా అభ్యర్థులు ముఖానికి మాస్కులు తప్పనిసరిగా ధరించాలి
5) ఎగ్జామ్ హాల్‌లో మీ సెల్‌ఫోన్, స్మార్ట్ ఫోన్లు స్విచ్ఛాన్ చేయాలి
6) అభ్యర్థులు తాగునీరు (వాటర్ బాటిల్స్) వెంట తెచ్చుకోవాలి
7) మీ పేరు, హాల్ టికెట్ నెంబర్, తండ్రి పేరు తెలిసేలా ఉన్న స్కీన్ షాట్ తప్పనిసరిగా ఎగ్జామ్ సెంటర్‌లో చూపించాలి.
Instructions for Candidates Appearing for the Pre-Recruitment Training Examination and Exam Centre's data with Hall Tickets & Medium pic.twitter.com/wXi9M6idAt
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) April 4, 2022
పరీక్షా విధానం ఇదే..
అరిథమెటిక్ అండ్ రీజనింగ్ 100 ప్రశ్నలు , ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు కేటాయించారు. జనరల్ స్టడీస్ లోనూ 100 ప్రశ్నలుంటాయి. ఒక్క ప్రశ్నకు ఒక్క మార్కు. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్‌కు ఒక గంట ముందు అంటే 1:30 సమయానికి ఉండాలని అభ్యర్థులకు పోలీసులు సూచించారు.
Also Read: Telangana Jobs 2022: నిరుపేద అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ శుభవార్త - లక్ష మందికి ఫ్రీ కోచింగ్
ఖాళీలు ఇవీ..
తెలంగాణలో పోలీసు శాఖకు సంబంధించి 16,587 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసింది. ఇందులో కానిస్టేబుల్ (Civil) - 4,965, కానిస్టేబుల్ (AR) - 4423, కానిస్టేబుల్ (IT&C) - 262, టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ (TSSP) - 5704, కానిస్టేబుల్ (Driver) PTO - 100, కానిస్టేబుల్ (మెకానిక్) PTO - 21, కానిస్టేబుల్ (SARCPL) - 100 ఉన్నాయి.
ఇంకా సబ్ ఇన్ స్పెక్టర్ (Civil) - 415, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (టీఎస్ఎస్పీ) - 23, రిజర్వ్ సబ్ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (AR) - 69, సబ్ ఇన్ స్పెక్టర్ (PTO), సబ్ ఇన్ స్పెక్టర్ (IT&C) - 23, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SARCPL) - 05 ఉన్నాయి.
Also Read: పోలీస్ జాబ్‌కి ట్రై చేస్తున్నారా? ట్రైనింగ్‌కి డబ్బుల్లేవా? ఇక్కడ ఫ్రీ