MPHA Application: మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 'మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్' పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 1న ప్రారంభమైంది. సెప్టెంబరు 19 వరకు దరఖాస్తుకు అవకాశం.
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 'మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్' పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 1న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబరు 19 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ & తెలంగాణ రాష్ట్ర ఎక్స్-సర్వీసెమెన్ ఉద్యోగులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర నర్సులు, మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. (లేదా) ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్(మహిళ) శిక్షణా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణను పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీలు: 1931
* మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫిమేల్) పోస్టులు
అర్హత: మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర నర్సులు మరియు మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్(మహిళ) శిక్షణా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణను పూర్తి చేసి ఉండాలి. (లేదా) గుర్తింపు పొందిన ఆసుపత్రులలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణను పూర్తి చేసుకొని ఉండాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకొని ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 44 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.500. ప్రాసెసింగ్ ఫీజు-రూ.200; ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ & తెలంగాణ రాష్ట్ర ఎక్స్-సర్వీసెమెన్ ఉద్యోగులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం: పరీక్ష ఓఎంఆర్ ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. పరీక్ష ఆంగ్లంలో జరుగుతుంది.
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.
జీతం: రూ.31,040 – 92,050 చెల్లిస్తారు.
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
నాబార్డులో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.89,150 వరకు జీతం
ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న 'నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డు)' దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 150 పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్షలు (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈసీఐఎల్‌లో 163 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- ఈ అర్హతలుండాలి
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్ కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..