TS High Court Recruitment 2022: తెలంగాణ హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత, టైపింగ్ వస్తే చాలు..!
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 10.08.2022.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.08.2022.రాతపరీక్ష హాల్‌టికెట్లు: 05.09.2022.రాతపరీక్ష పరీక్ష తేది: 25.09.2022.
![TS High Court Recruitment 2022: తెలంగాణ హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత, టైపింగ్ వస్తే చాలు..! Telangana High Court has released notification for direct recruitment to the posts of typist and copyists TS High Court Recruitment 2022: తెలంగాణ హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత, టైపింగ్ వస్తే చాలు..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/d98c4678b6d9aa09556292e784c93bd91658895314_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి జూలై 26న నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా హైకోర్టులో ఖాళీగా ఉన్న కాపీయిస్ట్, టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 85 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతి ద్వారా భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.24,280 నుంచి రూ.72,850ల వరకు జీతం చెల్లిస్తారు.
ఆగస్టు 10 నుంచి దరఖాస్తులు...
హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 10 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆగస్టు 25 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 25 (రాత్రి 11 గంటల 55 నిముషాల) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, టైప్ రైటింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు హాల్ టికెట్లు సెప్టెంబర్ 5 నుంచి విడుదలవుతాయి. పరీక్ష సెప్టెంబర్ 25న జరుగుతుంది.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు...
* మొత్తం ఖాళీల సంఖ్య: 85
1) టైపిస్ట్: 43 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఓసీ-19, ఈడబ్ల్యూఎస్-4, బీసీ-11, ఎస్సీ-6, ఎస్టీ-3.
2) కాపీయిస్ట్: 42 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఓసీ-19, ఈడబ్ల్యూఎస్-4, బీసీ-10, ఎస్సీ-6, ఎస్టీ-3.
TSPSC Recrument: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!
అర్హత: డిగ్రీ(ఆర్ట్స్) లేదా లా డిగ్రీతోపాటు టైప్‌రైటింగ్ (ఇంగ్లిష్-హయ్యర్ గ్రేడ్) టెక్నికల్ ఎగ్జామినేషన్ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఏజెన్సీ ఏరియా అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంది. నిబంధనల ప్రకారం ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, టైపింగ్ పరీక్ష (స్కిల్ టెస్ట్), సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.
పరీక్ష ఫీజు: రూ.800. ఎస్సీ,ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి.
పరీక్ష విధానం: మొత్తం 40 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 40 నిమిషాలు.
సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 10.08.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.08.2022.
* రాతపరీక్ష హాల్‌టికెట్లు: 05.09.2022.
* రాతపరీక్ష పరీక్ష తేది: 25.09.2022.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)