TS TET: టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో 'టెట్' నిర్వహణ, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం ఈ మేరకు జులై 7న నిర్ణయించింది.
తెలంగాణలో బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీయువకులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం ఈ మేరకు జులై 7న నిర్ణయించింది. రాష్ట్రంలో చివరిసారి గతేడాది జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీచర్ పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకున్నారు. వివిధ అంశాలపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.
విద్యాశాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలతో పాటు టీచర్ పోస్టుల భర్తీ, మన ఊరు-మన బడి పురోగతిపై చర్చించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం శుక్రవారం భేటీ అయింది. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ అంశాలపై చర్చించిన మంత్రి వర్గ ఉప సంఘం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.
డిగ్రీ కాలేజీల్లో 2,858 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు..
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఖాళీల భర్తీకి జులై 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నారు. వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిలో 527 మంది లెక్చరర్ పోస్టులను, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 341 పోస్టులను, హోనరేరియం కింద 50 టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా 1,940 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ పోస్టుల కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
'టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(ఎన్‌ఈఎస్‌టీఎస్) దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial