By: ABP Desam | Updated at : 24 Mar 2022 12:42 AM (IST)
తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన ఖాళీల్లో ఎక్కువ పోలీసు శాఖలోనే ఉన్నాయి. 16, 587 ఉద్యోగాలను ఈసారి నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వం భర్తీ చేయాలని నిర్ణయించింది. పోలీసులు శాఖ కూడా ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. ఇందులో టీపీఎస్సీ ద్వారా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మిగిలిన వాటిని టీఎస్ ఎల్‌పీఆర్‌బీతో పూరించనుంది.
పోలీసు శాఖలో భర్తీ కానున్న 16, 587 ఉద్యోగాల్లో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 4965 ఉన్నాయి. ఏఆర్ కానిస్టేబుల్ ఖాళీలు 4423 ఉన్నాయి. టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్స్ 5, 704 వెకెన్సీ చూపిస్తున్నారు. ఐటీ అండ్ సీ కానిస్టేబుల్స్ 262, పీటీవో కానిస్టేబుల్స్(డ్రైవర్స్) 100, కానిస్టేబుల్(మెకానిక్) పీటీవో 21, కానిస్టేబుల్(ఎస్‌ఏఆర్‌సీపీఎల్) 100 ఖాళీలు ఉన్నాయి.
To motivate the youth to choose police force as a career, an all around assistance will be provided by HCP by imparting Pre-recruitment training(prt) and it helps the aspiring candidates secure a job in the Home department vacancies(SIs & PCs) which will be recruited shortly. pic.twitter.com/RaebG8sUwd
— C.V.ANAND, IPS (@CPHydCity) March 10, 2022
సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు 415 ఉంటే ఏఆర్ రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఉద్యోగాలు 69, టీఎస్‌ఎస్పీ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 23, ఐటీ అండ్ సీ ఎస్‌ఐ పోస్టులు 23, ఎస్‌ఐ(పీటీవో), రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్‌ఏఆర్‌సీపీఎల్)ఐదు ఉద్యోగాలు ఉన్నాయి.
PRT for aspiring women candidates will be held at a separate facility. PRT covers accommodation,class room sessions,study material,physical training & mock tests.The modalities for selection and date of launch of PRT will be announced soon. pic.twitter.com/dpU7Ylbf5U
— C.V.ANAND, IPS (@CPHydCity) March 10, 2022
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎప్‌పీబీ) 8, సైంటిఫిక్ ఆఫీసర్స్(ఎఫ్‌ఎస్‌ఎల్) 14, సైంటిఫిక్ అసిస్టెంట్(ఎఫ్‌ఎస్‌ఎల్), ల్యాబ్ టెక్నీషియన్(ఎఫ్‌ఎస్‌ఎల్), ల్యాబ్ అసిస్టెంట్(ఎఫ్‌ఎస్‌ఎల్ 1 ఖాళీ మాత్రమే ఉంది. వీటితోపాటు ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 390, ఎస్‌పీఎఫ్ ఎస్‌ఐలు 12 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది.
ఉద్యోగాల భర్తీలో భాగంగా డిప్యూటిలీ జైలర్స్ ఉద్యోగాలను 8 భర్తీ చేయనున్నారు. వార్డర్ ఖాళీలు 136 ఉన్నాయి. మహిళా వార్డర్ పోస్టులు 10 వాటికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
RITES: రైట్స్ లిమిటెడ్‌లో 257 అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
HSL Recruitment: వైజాగ్ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే
BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 52 ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
Telangana Election Results 2023 LIVE: తెలంగాణలో పోల్ కౌటింగ్ షురూ- పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ముందంజ
Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం
Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?
DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!
/body>