TS DSC: తెలంగాణలో డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా, త్వరలోనే కొత్త షెడ్యూల్ వెల్లడి
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర 20 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన డీఎస్సీ (టీఆర్‌టీ) - 2023 పరీక్షలు వాయిదాపడ్డాయి.
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర 20 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన డీఎస్సీ (టీఆర్‌టీ) - 2023 పరీక్షలు వాయిదాపడ్డాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా పరీక్షలను వాయిదావేసినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీ దేవసేన అక్టోబరు 13న ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే వాయిదాపడిన పరీక్షల కొత్త షెడ్యూలు వెల్లడించనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. తాజాగా డీఎస్సీ పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి.
అక్టోబర్ 21 వరకు డీఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు అక్టోబర్ 20లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, అక్టోబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
గతంలో ప్రకటించిన డీఎస్సీ పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ నవంబర్ 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు.
➥ నవంబర్ 22న స్కూల్ అసిస్టెంట్ లాంగ్వెజ్ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి.
➥ నవంబరు 23న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల అభ్యర్థులకు నిర్వహిస్తారు. వీరందరికీ మొదటి విడతలోనే పరీక్షలు నిర్వహించి పూర్తి చేయనున్నారు.
➥ నవంబరు 24న లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు.
➥ నవంబరు 25 నుండి 30 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిని ప్రతీ రోజూ రెండు విడతల్లో నిర్వహించనున్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే డీఎస్సీ పరీక్ష తేదీలు, సిలబస్, అర్హతలను విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఆన్‌లైన్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ.. సెప్టెంబరు 20న అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు సబ్జెక్టుల వారీగా డీఎస్సీ పరీక్షల తేదీలను విద్యాశాఖ ఖరారు చేసింది. ప్రతీ రోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి 11.30 వరకు మొదటి విడత, రెండో విడతలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
మొత్తం ఖాళీల్లో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు; స్కూల్ అసిస్టెంట్ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 358, నిజామాబాద్ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ALSO READ:
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగ నియామక పరీక్షలు మరోసారి వాయిదా వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేసినట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది. నవంబర్ 2, 3 తేదీలలో జరగాల్సిన పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీఎస్ పీఎస్పీ గ్రూప్ 2 వాయిదా వేసినట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నవంబర్ 30న అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని ఈసీ ఇదివరకే ప్రకటించింది. గతంలో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అభ్యర్థు కోరిక, భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని నవంబర్ కు వాయిదా వేయడం తెలిసిందే.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..