అన్వేషించండి

SSC Constable: ఫిబ్రవరి 20 నుంచి కానిస్టేబుల్ పరీక్షలు, తెలుగులోనూ ప్రశ్నపత్రం

SSC: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 20 నుంచి మార్చి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.తెలుగుతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

SSC GD Constable Exam Pattern: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష కేంద్రాల వివరాలు, అప్లికేషన్‌ స్టేటస్‌ వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి పరీక్ష కేంద్రం, అప్లికేషన్‌ స్టేటస్‌ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ స్లిప్పులో రోల్‌ నంబర్‌, పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, విధివిధానాలు తదితర సమాచారం ఉంటుంది. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దేశంలో 128 నగరాల్లో  ఫిబ్రవరి 20 నుంచి మార్చి 12 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సుమారు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రాతపరీక్ష ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇందులో తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మళయాళం, ఉర్దూ తదితర 13 ప్రాంతీయ భాషలు ఉన్నాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను త్వరలోనే విడుదల చేయనున్నారు. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

సదరన్ రీజియన్ అప్లికేషన్ స్టేటస్ వివరాల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష కేంద్రం వివరాల కోసం క్లిక్ చేయండి..

కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్‌ జనరల్ డ్యూటీ (Constable GD), రైఫిల్‌ మ్యాన్‌ జనరల్ డ్యూటీ (Rifle Man GD) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నవంబరు 24న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 26,146 ఖాళీలను భర్తీచేయనున్నారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు 24 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. వయసు 18 - 23 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి దరఖాస్తులు సమర్పించారు. ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(BSF)లో 6174 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 11025 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 3,337 పోస్టులు, సశస్త్ర సీమాబల్‌(SSB)లో 635 పోస్టులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సెస్(ITBP)లో 3,189 పోస్టులు, అస్సాం రైఫిల్స్(AR)లో 1,490 పోస్టులు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్(SSF)లో 296 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో పురుషులకు 23347 పోస్టులు, మహిళలకు 2799 పోస్టులు కేటాయించారు. 

రాత పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్‌ ఇంటలిజెన్స్‌ & రీజనింగ్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ & జనరల్‌ అవర్‌నెస్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ-20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు (అర మార్కు) కోత విధిస్తారు. 

వివరాలు..

* మొత్తం ఖాళీల సంఖ్య: 26,146

పోస్టుల కేటాయింపు: యూఆర్-10,809, ఈడబ్ల్యూఎస్-3633, ఓబీసీ-5360, ఎస్టీ-2602, ఎస్సీ-3742.

విభాగం పోస్టుల సంఖ్య పోస్టుల కేటాయింపు
బీఎస్‌ఎఫ్‌ 6174 మెన్-5211, ఉమెన్-963
సీఐఎస్‌ఎఫ్‌ 11025 మెన్-9913, ఉమెన్-1112
సీఆర్‌పీఎఫ్‌ 3337 మెన్-3266, ఉమెన్-71
ఎస్‌ఎస్‌బీ 635 మెన్-593, ఉమెన్-42
ఐటీబీపీ 3189 మెన్-2694, ఉమెన్-495
ఏఆర్ 1490 మెన్-1448, ఉమెన్-42
ఎస్‌ఎస్‌ఎఫ్‌ 296 మెన్-222, ఉమెన్-74
మొత్తం ఖాళీలు 26,146 26,146

నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget