News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

SSC GD Constable: కానిస్టేబుల్‌ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అడ్మిట్‌ కార్డులు విడుదల, ఈ తేదీల్లో నిర్వహణ!

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/రైఫిల్ మ్యాన్/సిపాయి పోస్టుల భర్తీకి సంబంధించిన అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ (జీడీ)/రైఫిల్ మ్యాన్/సిపాయి పోస్టుల భర్తీకి సంబంధించిన అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. రాతపరీక్షలో అర్హత సాధించి, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల ఈ -అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జులై 12న అధికారిక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు ఉంటేనే ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులను అనుమతిస్తామని సీఆర్‌పీఎఫ్ స్పష్టంచేసింది.

అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్ చేయండి..

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జులై 17 నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పీఈటీ/ పీఎస్‌టీ ఫలితాలు జులై 30న విడుదల కాగా శారీరక సామర్థ్య పరీక్షలకు మొత్తం 3.70 లక్షల మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. వారిలో 1.46 లక్షల మంది వైద్య పరీక్షలకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం రిజర్వేషన్లు అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ చేస్తోంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులను మే 1 నుంచి 6 తేదీల్లో నిర్వహించింది. వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం రిజర్వేషన్‌ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్‌(జీడీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్‌ఎస్‌సీ జనవరిలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష సమాధానాల ప్రాథమిక కీని ఫిబ్రవరి 18న విడుదల చేసింది. ఈ కీపై ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించారు. తుది కీతో పాటు ఫలితాలు వెల్లడించాక ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు.

మొదట నోటిఫికేషన్ విడుదల సమయంలో మొత్తం 24,369 ఖాళీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్యను గత నవంబర్‌లో 45,284కు పెంచుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఆ పోస్టులకు అదనంగా మరో 1,151 ఖాళీలను కలిపారు. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,435కు చేరింది. ‌తాజాగా ఐటీబీపీ విభాగంలో సిబ్బంది నియామకానికి మరో 3,257 పోస్టులను కలపడంతో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య ‌50,187 పెరిగింది. 

మొత్తం 50,187 ఖాళీల్లో బీఎస్‌ఎఫ్‌లో 21,052; సీఐఎస్‌ఎఫ్‌లో 6,060; సీఆర్‌పీఎఫ్‌లో 11,169; ఎస్‌ఎస్‌బీలో 2274; ఐటీబీపీలో 5642, ఏఆర్‌లో 3601, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214, ఎన్‌సీబీలో 175 పోస్టులు ఉన్నాయి. ఎన్‌సీబీ మినహాయించి మొత్తం ఖాళీల్లో 44,439 పోస్టులు పురుషులకు, 5573 పోస్టులు మహిళలకు కేటాయించారు.

ALSO READ:

'టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మ‌ల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 12 Jul 2023 11:10 PM (IST) Tags: Admit cards SSC GD Constable Admit Card Staff Selection Commission(SSC) Central Armed Police Forces (CAPFs) SSF Rifleman (GD)

ఇవి కూడా చూడండి

వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు

వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక

VCRC Recruitment: వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!

VCRC Recruitment: వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!

ICMR: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఆర్‌టీలో 78 టెక్నికల్, ల్యాబొరేటరీ అటెండెంట్‌ ఉద్యోగాలు

ICMR: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఆర్‌టీలో 78 టెక్నికల్, ల్యాబొరేటరీ అటెండెంట్‌ ఉద్యోగాలు

టాప్ స్టోరీస్

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Telangana BJP :  సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు