అన్వేషించండి

SSC CHSL 2024 Admitcard: సీహెచ్‌ఎస్‌ఎల్‌-2024 'టైర్-1' హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

SSC CHSL 2024: దేశవ్యాప్తంగా జులై 1 నుంచి నిర్వహించనున్న కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ 2024 టైర్-1 పరీక్ష అడ్మిట్ ‌కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 27న విడుదల చేసింది. వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.

SSC CHSL 2024 Admitcard: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) 10+2- 2024 'టైర్-1' పరీక్ష అడ్మిట్‌కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 27న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లలో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వారివారి రీజినల్ వెబ్‌సైట్ల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (లేదా) రూల్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు పొందవచ్చు. ప్రకటించిన షెడ్యూలు  దేశవ్యాప్తంగా జులై 1 నుంచి 11 వరకు 'టైర్-1' కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ 3 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. 

SSC CHSL 2024 అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 3712 ఉద్యోగాల భర్తీకి 'CHSL-2024' నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏప్రిల్ 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 8 నుంచి మే 7 వరకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. టైర్‌-1, టైర్‌-2 రాతపరీక్షలతోపాటు అవసరమైన పోస్టులకు కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. తాజాగా టైర్-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.

'టైర్-1' పరీక్ష (ఆబ్జెక్టివ్) పరీక్ష విధానం..
మొత్తం 200 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) నుంచి 15 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.

SSC CHSLE - 2022: సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ-2022 'టైర్-1' ఫలితాలు విడుదల-  తర్వాతి దశకు 40,224 మంది ఎంపిక!

 

 

 

 

 

 

 

 

టైర్-2 పరీక్ష విధానం..
SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక

స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ పరీక్ష విధానం..

✦ CHSL 'టైర్-2' పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాలి దశలో టైర్-3 పరీక్షలు ఉంటాయి. ఈ దశలో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత ప‌రీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.

✦ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు.. డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టుల‌కు గంట‌కు 8000 కీ డిప్రెష‌న్స్ కంప్యూట‌ర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెష‌న్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవ‌ధిలో కంప్యూట‌ర్‌లో టైప్ చేయ‌మంటారు.

✦ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 ప‌దాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 ప‌దాలు టైప్ చేయాలి.

జీతాభత్యాలు..

➥ ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900-63,200 ఇస్తారు.

➥  డేటాఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,500-81,100 (పే లెవల్-4), రూ.29,200-92,300 (పే లెవల్-4) ఇస్తారు. 

➥  డేటాఎంట్రీ ఆపరేటర్‌ (గ్రేడ్‌-ఎ)కు పోస్టులకు రూ.29,200-92,300 ఇస్తారు.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma : కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
Virat Kohli: అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
T20 World Cup 2024 Final IND vs SA: ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABPAkshar Patel All Round Performance | T20 World Cup 2024 Final లో అదరగొట్టిన అక్షర్ పటేల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rohit Sharma : కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
Virat Kohli: అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
T20 World Cup 2024 Final IND vs SA: ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
Bachhala Malli: బచ్చలమల్లి గ్లింప్స్... ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? అల్లరి నరేష్ మాస్ అదిరిందమ్మా!
బచ్చలమల్లి గ్లింప్స్... ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? అల్లరి నరేష్ మాస్ అదిరిందమ్మా!
Virat Kohli: దుమ్ములేపిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్ - 6 గంటల్లోనే బీభత్సం!
దుమ్ములేపిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్ - 6 గంటల్లోనే బీభత్సం!
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వాడితే మోత మోగిపోద్ది, ఇంకెందుకంటా ఆ కార్డు?
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వాడితే మోత మోగిపోద్ది, ఇంకెందుకంటా ఆ కార్డు?
Nivetha Pethuraj:  కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటోన్న 'అలవైకుంఠపురంలో' బ్యూటీ నివేదా పేతురాజ్!
కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటోన్న 'అలవైకుంఠపురంలో' బ్యూటీ నివేదా పేతురాజ్!
Embed widget