CHSL Final Key: సీహెచ్‌ఎస్‌ఎల్-2023 'టైర్-1' ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 1,762 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (CHSLE)-2023 (టైర్-1) ఫైనల్ ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబర్ 17న విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 1,762 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (CHSLE)-2023 (టైర్-1) ఫైనల్ ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబర్ 17న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి ఆన్సర్ కీతో పాటు ప్రశ్నపత్రాలు చూసుకోవచ్చు. అక్టోబరు 31 వరకు ఆన్సర్ కీ, క్వశ్చన్ పేపర్లు అందుబాటులో ఉండనున్నాయి.టైర్-1 పరీక్ష ప్రాథమిక కీలో అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని.. తాజాగా ఫైనల్ కీని ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది.
ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి మే నెలలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆగస్టులో టైర్-1 పరీక్ష నిర్వహించారు. సెప్టెంబరు 27న టైర్-1 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా టైర్-2 పరీక్షకు 19,556 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. టైర్-2 పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో కంప్యూటర్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
టైర్-2 పరీక్ష విధానం..
స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ పరీక్ష విధానం..
✦ టైర్-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టైర్-3లో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
✦ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు.. డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టులకు గంటకు 8000 కీ డిప్రెషన్స్ కంప్యూటర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెషన్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్‌లో టైప్ చేయమంటారు.
✦ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 పదాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 పదాలు టైప్ చేయాలి.
ALSO READ:
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 14న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. టైర్-1, టైర్-2 రాతపరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..