News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

SSC CGL: సీజీఎల్‌లో అదనంగా 940 పోస్టులు - 8,440కు చేరిన మొత్తం పోస్టుల సంఖ్య

సీజీఎల్‌-2023 పోస్టుల సంఖ్యను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెంచింది. నోటిఫికేషన్‌ సమయంలో మొత్తం 7,500 ఖాళీలు ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా ఆ సంఖ్యను 8,440కు పెంచుతూ సవరణ ప్రకటన విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌) ఎగ్జామ్‌-2023 పోస్టుల సంఖ్యను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెంచింది. నోటిఫికేషన్‌ సమయంలో మొత్తం 7,500 ఖాళీలు ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా ఆ సంఖ్యను 8,440కు పెంచుతూ సవరణ ప్రకటన విడుదల చేసింది. దీంతో అదనంగా 940 పోస్టులు చేరాయి. సీజీఎల్-2023 నోటిఫికేషన్ ఏప్రిల్ 3న విడుదలకాగా.. టైర్‌-1 పరీక్షలను జులైలో నిర్వహించి, ఆగస్టు 1న ఆన్సర్ కీ విడుదల చేసింది. ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది.

టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్‌ 25, 26, 27 తేదీల్లో టైర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. టైర్‌-1, టైర్‌-2 ఎగ్జామినేషన్‌, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆయా పోస్టులను బట్టి వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 ఉంటుంది. 

ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో 7,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. 

పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 7,500

➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్

➥ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

➥ అసిస్టెంట్/ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్

➥ ఇన్‌స్పెక్టర్ - సెంట్రల్ ఎక్సైజ్

➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)

➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్

➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)

➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)

➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)

➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్

➥ రిసెర్చ్ అసిస్టెంట్ (సీబీఐసీ, NHRC)

➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)

➥ సబ్ ఇన్‌స్పెక్టర్  (NIA)

➥ సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌సీబీ)

➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)

➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ, etc.,)

➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,)

➥ అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్

➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)

➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్

➥ ట్యాక్స్ అసిస్టెంట్

టైర్-2 పరీక్ష:

ALSO READ:

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 29 ఖాళీలు, యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 95 ట్రైనీ & ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ట్రైనీ & ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 95 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 07 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 29 Aug 2023 06:18 PM (IST) Tags: SSC Jobs ssc recruitment 2023 SSC CGL Examination 2023 Combined Graduate Level Examination 2023 SSC CGLE 2023 SSC CGL Notification 2023 SSC CGL Application 2023

ఇవి కూడా చూడండి

UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

TSSPDCL Jobs: విద్యుత్‌ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌, మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి

TSSPDCL Jobs: విద్యుత్‌ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌, మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి

Anganwadi Teachers: అంగన్వాడీ టీచర్లకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్, పీఆర్సీ అమలుకు నిర్ణయం

Anganwadi Teachers: అంగన్వాడీ టీచర్లకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్, పీఆర్సీ అమలుకు నిర్ణయం

JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?

ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?

టాప్ స్టోరీస్

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు

Chandrababu Arrest: చంద్రబాబు ఓ క్రిమినల్, అందుకే అరెస్ట్ చేశారు - స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

Chandrababu Arrest: చంద్రబాబు ఓ క్రిమినల్, అందుకే అరెస్ట్ చేశారు - స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన