SSB Exam Halltickets: సశస్త్ర సీమాబల్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
సశస్త్ర సీమాబల్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ కమాండెంట్(వెటర్నరీ) ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లను డిసెంబరు 20న విడుదల చేసింది.
SSB Constable Admit Card 2023: సశస్త్ర సీమాబల్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ కమాండెంట్(వెటర్నరీ) ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లను డిసెంబరు 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డుల అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 26, 27 తేదీల్లో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.
అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..
కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సశస్త్ర సీమాబల్ 1656 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్షలో ప్రతిభ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులను దేశంలో ఎక్కడైనా లేదా దేశం వెలుపలా నియమించే అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 1656
➥ సబ్ ఇన్‌స్పెక్టర్: 111 పోస్టులు
➥ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (పారామెడికల్): 30 పోస్టులు
➥ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్): 40 పోస్టులు
➥ హెడ్‌కానిస్టేబుల్: 914 పోస్టులు
➥ కానిస్టేబుల్ పోస్టులు: 543 పోస్టులు
➥ అసిస్టెంట్ కమాండెంట్(వెటర్నరీ): 18 పోస్టులు
ఎంపిక విధానం..
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్‌ఈ), రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సబ్–ఇన్‌స్పెక్టర్(కమ్యూనికేషన్) పోస్టుకు మాత్రమే పీఈటీ నిర్వహిస్తారు. 1.6 కిలో మీటర్ల పరుగును పురుష అభ్యర్థులు 6 నిమిషాల 30 సెకన్లలో ముగించాలి. మహిళా అభ్యర్థులు 800 మీటర్ల రేసును 4 నిమిషాల్లో ముగించాలి. ఎక్స్–సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పీఈటీ లేదు. వీరు పీఎస్‌టీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌లకు హాజరుకావాలి.
రాత పరీక్ష విధానం..
పీఈటీ, పీఎస్‌టీ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. దీన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. రాతపరీక్ష రెండు పార్ట్‌లుగా 150 ప్రశ్నలకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. పార్ట్–1లో జనరల్ నాలెడ్జ్, మ్యాథమేటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్ /జనరల్ హిందీ 50 మార్కులకు ఉంటాయి. పార్ట్–2లో టెక్నికల్ సబ్జెక్టుకు 100 మార్కులుంటాయి. రాతపరీక్షకు సంబంధించి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులు పొందాలి.
రాత పరీక్షలో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులను నిర్వహిస్తారు. పోస్టుల సంఖ్యకు మూడు రెట్ల మంది అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌కు పిలుస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు.
ALSO READ:
ఎస్‌ఎస్‌సీ - ఎస్‌ఐ ఫిజికల్ ఈవెంట్స్ ఫలితాలు విడుదల, పేపర్-2కు 8544 మంది అర్హత
ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి సంబంధించి పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించిన ఫిజికల్ ఈవెంట్ల (PET, PMT) ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిసెంబరు 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ)లకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..