అన్వేషించండి

Anthropic CEO : సాఫ్ట్‌వేర్ రంగంలో ఆంత్రోపిక్ ప్రకంపనలు.. ఏడాదిలోనే ఇంజనీరింగ్ అంతమట !

Software Anthropic: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. పూర్తిగా ఏఐ ఆ పనులు చేయబోతోంది. అందరూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటేనే ఉద్యోగాలు నిలబడనున్నాయి.

Software engineering will be completely obsolete in 12 months:   ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  రంగంలో అగ్రగామి సంస్థ అయిన ఆంత్రోపిక్   సీఈఓ డారియో అమోడీ చేసిన తాజా వ్యాఖ్యలు టెక్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రాబోయే 6 నుంచి 12 నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ రంగం తన ఉనికిని కోల్పోతుందని, ప్రస్తుతం మనం చూస్తున్న కోడింగ్ పద్ధతులు పూర్తిగా కనుమరుగవుతాయని ఆయన ప్రకటించారు.  ఏఐ మోడల్స్ అభివృద్ధి చెందుతున్న వేగాన్ని బట్టి చూస్తే, మనుషులు చేసే సంక్లిష్టమైన కోడింగ్‌ను ఏఐ వ్యవస్థలే స్వయంగా పూర్తి చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు.

ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన  వారు పెట్టిన కంపెని ఆంత్రోపిక్

ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చిన కీలక సభ్యులు స్థాపించిన  ఆంత్రోపిక్  సంస్థ, ప్రస్తుతం క్లాడ్  వంటి శక్తివంతమైన ఏఐ మోడళ్లను రూపొందిస్తోంది. తమ సంస్థలోని ఇంజనీర్లు ఇప్పుడు సొంతంగా కోడ్ రాయడం మానేశారని, కేవలం ఏఐ రూపొందించిన కోడ్‌ను సరిచూడటానికే పరిమితమయ్యారని అమోడీ వెల్లడించారు. గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల నుంచి బిలియన్ల కొద్దీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఈ సంస్థ వ్యాఖ్యలను టెక్ విశ్లేషకులు చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భవిష్యత్‌పై ఆందోళన

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రత్యేకించి ప్రాథమిక స్థాయి కోడర్లు , టెస్టింగ్, డాక్యుమెంటేషన్ విభాగాల్లో పనిచేసే వారికి ముప్పు పొంచి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో పదుల సంఖ్యలో ఇంజనీర్లు కలిసి చేసే ప్రాజెక్టును, భవిష్యత్తులో ఒక్క ఇంజనీర్ ఏఐ సహాయంతో పూర్తి చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఐటీ కంపెనీల్లో మానవ వనరుల అవసరం గణనీయంగా తగ్గే ప్రమాదం కనిపిస్తోంది.

మార్పుగా చూస్తేనే ఉద్యోగాలు నిలబడతాయి!

టెక్ నిపుణులు ఈ మార్పును  అంతం గా కాకుండా పరిణామ క్రమం  గా అభివర్ణిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పూర్తిగా పోదని, దాని రూపం మారుతుందని వారు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో ఇంజనీర్లు కోడ్ రాసే  లేబర్ లా కాకుండా, ఏఐని నడిపించే  ఆర్కెస్ట్రేటర్ లా  ఏఐ ప్రాంప్ట్ ఇంజినీర్‌లా వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంటే, కేవలం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న వారి కంటే, సమస్యలను లోతుగా విశ్లేషించే వారికి మాత్రమే డిమాండ్ ఉంటుంది.            

సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మారాల్సిన సమయం 

ఈ విప్లవాత్మక మార్పుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ నిపుణులు తమను తాము మలచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేవలం రొటీన్ కోడింగ్‌పై ఆధారపడకుండా, ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడం , కొత్త నైపుణ్యాలను నిరంతరం నేర్చుకోవడం ద్వారానే ఈ రంగంలో నిలదొక్కుకోగలరని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీ మారుతున్న వేగంతో పోటీ పడలేని పక్షంలో, వృత్తిపరమైన సవాళ్లు ఎదురవ్వడం తప్పదని హెచ్చరిస్తున్నారు.       


 

టాప్ హెడ్ లైన్స్

రైల్వేలో 1688 ఉద్యోగాలు.. RRB NTPC Jobs నోటిఫికేషన్- ముఖ్యమైన తేదీ, ఫీజు వివరాలు
రైల్వేలో 1688 ఉద్యోగాలు.. RRB NTPC Jobs నోటిఫికేషన్- ముఖ్యమైన తేదీ, ఫీజు వివరాలు
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
AP Home Guards: హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు
హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు
Driver Operator Jobs: ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
Hyderabad Metro Rail Project:హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బరాబర్‌ అమన్‌కి ఇచ్చే పడేసిన త్రిగుణ్, ముకేశ్! విన్నర్ డబ్బు ఎలా ఇస్తారంటూ గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బరాబర్‌ అమన్‌కి ఇచ్చే పడేసిన త్రిగుణ్, ముకేశ్! విన్నర్ డబ్బు ఎలా ఇస్తారంటూ గొడవ!
Tiger Tension: వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
Dementia Signs : మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
Embed widget