అన్వేషించండి

SBI Recruitment: 6 వేలకు పైగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌, స్టైఫండ్‌ ఎంతంటే?

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ భారీ సంఖ్యలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 6,160 ఖాళీలను భర్తీ చేయనుంది.

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ భారీ సంఖ్యలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 6,160 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో ఏపీలో 390 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 125 ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

* ఎస్‌బీఐ - అప్రెంటిస్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 6160 (ఏపీ-390, తెలంగాణ-125)

కేటగిరీల వారీగా ఖాళీలు: ఎస్సీ- 989, ఎస్టీ- 514, ఓబీసీ- 1389, ఈడబ్ల్యూఎస్- 603, జనరల్- 2,665 చొప్పున ఉన్నాయి. 

అర్హత:  ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. 

వయోపరిమితి: 2023 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

స్టైఫండ్: ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ ఏడాది కాలం పాటు నెలకు ₹15 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ఇతర అలవెన్సులకు అర్హులు కాదు.

ఆన్‌లైన్ రాత పరీక్ష అక్టోబర్/నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 01.09.2023.

* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లించడానికి చివరితేది: 21.09.2023.

* దరఖాస్తు వివరాల్లో సవరణకు చివరితేది: 21.09.2023.

* దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 06.10.2023

Notification

Online Application

ALSO READ:

రాజమండ్రి- ఏపీ సివిల్ సప్లయ్ విభాగంలో 717 ఖాళీలు, వివరాలు ఇలా!
రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 717 టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబరు 8 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఐఐటీ గాంధీనగర్‌లో 23 నాన్ టీచింగ్ ఫోస్టులు
IIT Recruitment: గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

కోనసీమ జిల్లా- ఏపీ సివిల్‌ సప్లయ్ విభాగంలో 993 ఖాళీలు, వివరాలు ఇలా!
కోనసీమలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన వివిధ సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 993 టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబరు 8 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
Embed widget