SBI JOBS: డిగ్రీతో ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. 6100 పోస్టులకు నోటిఫికేషన్
SBI Apprentice Recruitment 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 6100 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో తెలంగాణలో 125, ఆంధ్రప్రదేశ్‌లో 100 ఖాళీలు ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్‌బీఐకి చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం దేశవ్యాప్తంగా 6100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో తెలంగాణలో 125, ఆంధ్రప్రదేశ్‌లో 100 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తు స్వీకరణ జూలై 6న ప్రారంభం కాగా, 26వ తేదీతో ముగియనుంది. అర్హులు, ఆసక్తి ఉన్న వారు వీటికి దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఆ రాష్ట్రంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. స్థానిక భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తెలుగు లేదా ఉర్దూ భాష వచ్చి ఉండాలని పేర్కొంది.
ఖాళీల వివరాలు..
తెలంగాణ: 125
నిజామాబాద్ -11, మహబూబ్‌నగర్ -9, సూర్యాపేట -7, ఖమ్మం -7, భద్రాద్రి కొత్తగూడెం -6, నల్గొండ -6, రంగారెడ్డి -6, వికారాబాద్ -6, యాదాద్రి భువనగిరి-4, మెదక్ -4, నాగర్‌కర్నూల్ -4, కామారెడ్డి -4, కరీంనగర్ -4, సంగారెడ్డి -5, సిద్దిపేట -5, నిర్మల్ -3, పెద్దపల్లి -3, మహాబూబాబాద్ -3, జనగాం -3, జయశంకర్ భూపాలపల్లి-3, ఆదిలాబాద్ -3, వరంగల్ రూరల్ -3, వనపర్తి -3, మల్కాజ్‌గిరి -2, జగిత్యాల్ -2, జోగులంబ గద్వాల -2, కొమరంభీమ్ -2, మంచిర్యాల -2, సిరిసిల్లా -2, వరంగల్ -1
ఆంధ్రప్రదేశ్: 100
నెల్లూరు -8, శ్రీకాకుళం -8, విజయనగరం -8, తూర్పు గోదావరి -8, పశ్చిమ గోదావరి -8, ప్రకాశం -8, చిత్తూరు -8, వైఎస్ఆర్ కడప -8, అనంతపురం -8, విశాఖపట్నం -7, కృష్ణా -7, గుంటూరు -7, కర్నూలు -7
పరీక్ష విధానం..
ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాషల్లో అందుబాటులో ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు సమాధానానికి పావు (1/4) మార్కుల కోత విధిస్తారు. జనరల్ / ఫైనాన్షియల్ అవేర్ నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగాలకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో విభాగంలో 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఒక్కో విభాగానికి 15 నిమిషాల సమయం కేటాయించారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: జూలై 6, 2021
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 26, 2021
ఆన్‌లైన్ పరీక్ష: ఆగస్టు 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఫీజుగా రూ.300 చెల్లించాలి.
వెబ్‌సైట్:
https://bank.sbi/careers
https://www.sbi.co.in/careers
https://nsdcindia.org/apprenticeship
https://apprenticeshipindia.org
http://bfsissc.com
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
శిక్షణ కాలం: ఒక ఏడాది పాటు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలను కేటాయించారు.