![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
BC Backlog Posts: ఆర్జీయూకేటీలో 103 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ఏపీలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీలో బీసీ బ్యాక్‌లాగ్, రెగ్యులర్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 103 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
![BC Backlog Posts: ఆర్జీయూకేటీలో 103 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి RGUKT AP Recruitment of Associate Professors BC Backlog and regular Posts latest Telugu News update BC Backlog Posts: ఆర్జీయూకేటీలో 103 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/14/1928e10c1eb8528f7d207324a85817431699906671230522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏపీలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో బీసీ బ్యాక్‌లాగ్, రెగ్యులర్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 103 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 20లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నవంబర్ 20న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. దీంతోపాటు దరఖాస్తు హార్డ్ కాపీలతో సెల్ఫ్ అటెస్టేషన్ చేయించిన డాక్యుమెంట్లను నవంబర్ 27లోపు నూజివీడులోని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌కు సమర్పించాలి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.3000. ఓవర్సీస్ అభ్యర్థులు రూ.8400 (100 యూఎస్ డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.
వివరాలు..
* అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 103
➥ అసోసియేట్ ప్రొఫెసర్ (బీసీ బ్యాక్‌లాగ్): 19 పోస్టులు
➥ అసోసియేట్ ప్రొఫెసర్ (రెగ్యులర్): 84 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: కెమికల్ ఇంజినీరింగ్-04, సివిల్ ఇంజినీరింగ్-10, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్-25, ఎకనామిక్స్-01, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-14, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-27, ఇంగ్లిష్-02, మేనేజ్‌మెంట్-01, మ్యాథమెటిక్స్-04, మెకానికల్ ఇంజినీరింగ్-12, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్-04, ఫిజిక్స్-01.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీతోపాటు కనీసం 6 పబ్లికేషన్స్ ఉండాలి. టీచింగ్/రిసెర్చ్ విభాగంలో కనీసం 8 సంవత్సరాల అనుభవం ఉండాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు: అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.3000. ఓవర్సీస్ అభ్యర్థులు రూ.8400 (100 యూఎస్ డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
జీతం: రూ.1,31,400 - రూ.2,17,100.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar
Rajiv Gandhi University of Knowledge Technologies
I-3 Administrative Building
Nuzvid Campus, Mylavaram Road,
City: Nuzvid
District: Eluru
Andhra Pradesh – Pin Code:521202.
ముఖ్యమైన తేదీలు..
➤ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.11.2023. (5 P.M.)
➤ దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది: 27.11.2023. (5 P.M.)
➤ ప్రాథమిక ఎంపిక జాబితా వెల్లడి: 30.11.2023.
➤ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ: 07.12.2023 (5.00 P.M)
➤ తుది ఎంపిక జాబితా వెల్లడి: 08.12.2023.
ALSO READ:
ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,832 అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని డివిజన్/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,832 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి. అడకమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10న ప్రారంభంకాగా.. డిసెంబరు 9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో 'కేంద్ర' కొలువులు - 1899 'పోస్టల్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
భారతీయ తపాలా శాఖ (ఇండియా పోస్ట్) దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో స్పోర్ట్స్ కోటా(Sports Quota ) కింద వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1899 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో పోస్టల్ అసిస్టెంట్(Postal Assistant )- 598 ఖాళీలు, సార్టింగ్ అసిస్టెంట్(Sorting Assistant)-143 ఖాళీలు, పోస్ట్‌మ్యాన్(Postman)-585 ఖాళీలు, మెయిల్ గార్డ్(Mail Guard )-03 ఖాళీలు, ఎంటీఎస్(Multi Tasking Staff- MTS)-570 ఖాళీలు ఉన్నాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)