APCTD: తిరుపతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి
APCTD: తిరుపతిలోని రీజినల్ జీఎస్‌టీ ఆడిట్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్, కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
APCTD Tirupati Recruitment: తిరుపతిలోని రీజినల్ జీఎస్‌టీ ఆడిట్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్, కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీతోపాటు టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, పీజీడీసీఏ, డీసీఏ, ఇంజినీరింగ్ అర్హత ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు డిసెంబరు 8లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు..
➥ డేటా ఎంట్రీ ఆపరేటర్
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్త్‌తోపాటు టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్/పీజీడీసీఏ/డీసీఏ/కంప్యూటర్స్‌లో ఇంజినీరింగ్ లేదా ఏదైనా డిగ్రీ అర్మత ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
వయోపరిమితి: 31.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,500.
➥ ఆఫీస్ సబార్డినేట్
అర్హత: 7వ తరగతి విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 31.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.15,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ప్రకారం.
దరఖాస్తుతోపాటు జతచేయాల్సిన డాక్యుమెంట్లు: ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, ఇతర అవసరమైన డాక్యుమెంట్లు.
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:
O/o The Collector & District Magistrate,
Padmavathi Nilayam, Tirupati.
దరఖాస్తుకు చివరితేది: 08.12.2023.
ALSO READ:
ఏపీఎస్సీఎస్సీఎల్, విజయనగరంలో అకౌంటెంట్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం- కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా లేదా నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
అనంతపురం జిల్లా వైద్యారోగ్యశాఖలో 72 పోస్టులు, ఈ అర్హతలుండాలి
అనంతపురం జిల్లా వైద్యారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ- కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైద్య సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ప్రభుత్వ వైద్య కళాశాల/ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(అనంతపురం), ప్రభుత్వ జనరల్ హాస్పిటల్(అనంతపురం), కాలేజ్ ఆఫ్ నర్సింగ్(అనంతపురం)లో 72 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబు 4లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply