PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో 84 ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా
హైదరాబాద్ లోని పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ టీచింగ్ ఫ్యాకల్టీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 84 అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ టీచింగ్ ఫ్యాకల్టీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 84 అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతో పాటు నెట్/స్లెట్/సెట్ లేదా ఎంఫిల్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1,500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది. సెప్టెంబరు 30లోగా దరఖాస్తులు సమర్పించాలి.
ఖాళీల వివరాలు..
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్(వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ): 56 పోస్టులు
➥ అసోసియేట్ ప్రొఫెసర్(వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ): 28 పోస్టులు
విభాగాలు: యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రిషన్, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, లైవ్‌స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ అనాటమీ, వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్, వెటర్నరీ బయోకెమిస్ట్రీ, వెటర్నరీ గైనకాలజీ అండ్ ఓబ్‌స్టేట్రిక్స్, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ పారాసైటాలజీ, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమియాలజీ, వెటర్నరీ సర్జరీ, రేడియాలజీ.
అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్/ స్లెట్/ సెట్ లేదా ఎంఫిల్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1,500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750 చెల్లించాలి.
దరఖాస్తుకు చివరితేదీ: 30.09.2023.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar,
P.V.Narsimha Rao Telangana
Veterinary University, Administrative Office,
Rajendranagar, Hyderabad-500 030 (TS).
ASSISTANT PROFESSOR APPLICATION
ASSOCIATE PROFESSOR APPLICATION
ALSO READ:
డిగ్రీ అర్హతతో 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్, ఏడాదికి రూ.6.50 లక్షల జీతం
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా ఈ పోస్టులను ఐడీబీఐ భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్‌రూమ్ సెషన్, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ) ఉద్యోగం లభిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..